Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
సమయానికి రాని పంతుళ్ళు.. అదే దారిలో పిల్లలు.

సమయానికి రాని పంతుళ్ళు.. అదే దారిలో పిల్లలు.

వార్త 2 months ago

Kambalapally Government School: పిల్లలను దారిలో పెట్టాల్సిన ఉపాధ్యాయులే దారి తప్పితే ఆ పిల్లలకు దిక్సూచి ఎవరు… సదాశివపేట మండలం లోని కంబాలపల్లి గ్రామంలో ఉదయం 8:10 నిమిషాలు కావస్తున్నప్పటికీ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో స్లీపర్ కానీ ఉపాధ్యాయులు కానీ ఎవరూ రాలేదు.

ఎండాకాలం కదా అని ముందే బోధించే సమయం తక్కువగా ఉండడంతో ఆ సమయానికి కూడా ఉపాధ్యాయులు రాకపోవడం విడ్డూరంగా అనిపిస్తుంది. సమయానికి గంటను కొట్టే గంట కూడా కింద ఉండడంతో ఒక విద్యార్థి దానిని పైన తగిలేయడానికి నానా అవస్థలు పడుతున్నాడు. మీ టీచర్లు ఇంకా రాలేదు అని అక్కడ ఉన్న ఐదు ఆరుగురు విద్యార్థులను అడగగా ఇంకా కొద్దిసేపటి తర్వాత వస్తారు అని జవాబు ఇచ్చారు. పద్ధతులు లేని ప్రభుత్వ పాఠశాలలో తమ పిల్లలను చేర్పించడానికి ఈ కారణాల వల్లనే కొందరు తల్లిదండ్రులు వెనకాడుతున్నారు. పద్ధతులు బోధించాల్సిన గురువులే పద్ధతులు పాటించకపోతే ఎలా అని పలువురు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.

 Kambalapally Government School: The children who don’t come on time… The children on the same path…

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

డీలిమిటేషన్‌పై రేవంత్ రెడ్డి యుద్ధం - దక్షిణాది సీఎంలకు లేఖలు!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha