CM Revanth Reddy Delimitation Letter: కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన డీలిమిటేషన్ (నియోజకవర్గాల పునర్విభజన) ప్రక్రియ దక్షిణాది రాష్ట్రాల ప్రాధాన్యతను దెబ్బతీస్తుందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఈ విషయంలో దక్షిణాది రాష్ట్రాలన్నీ ఏకతాటిపైకి రావాలని పిలుపునిస్తూ ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, కేరళ, పుదుచ్చేరి ముఖ్యమంత్రులకు ఆయన లేఖలు రాశారు.
Read Also:Manoor ASI Govind Nayak: పోలీస్ వాహనం ఢీకొని ఏఎస్ఐ గోవింద్ నాయక్ మృతి!
దక్షిణాదికి అన్యాయం ఎందుకు?
కేవలం జనాభా ప్రాతిపదికన లోక్‌సభ స్థానాలను 543 నుండి 850కి పెంచితే, జనాభా నియంత్రణ పాటించిన దక్షిణాది రాష్ట్రాలు పార్లమెంటులో తమ గొంతుకను కోల్పోతాయని రేవంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.కుటుంబ నియంత్రణ పాటించి, అభివృద్ధిలో దూసుకుపోతున్న రాష్ట్రాలకు సీట్లు తగ్గించడం అంటే అభివృద్ధి సాధించినందుకు శిక్ష వేయడమేనని ఆయన పేర్కొన్నారు.జనాభా ఎక్కువగా ఉన్న ఉత్తరాది రాష్ట్రాలకు ఎక్కువ సీట్లు లభించి, దక్షిణాది ప్రాధాన్యం తగ్గే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
CM Revanth Reddy Delimitation Letter: రేవంత్ రెడ్డి ప్రతిపాదించిన 'హైబ్రిడ్ మోడల్' (Hybrid Model)
కేంద్రం అనుసరిస్తున్న గందరగోళ ధోరణిని ఎండగడుతూ, రేవంత్ రెడ్డి ఒక వినూత్నమైన 'హైబ్రిడ్ మోడల్'ను ప్రతిపాదించారు. కేంద్రం పెంచాలనుకుంటున్న అదనపు సీట్లలో సగాన్ని (50%) నేరుగా దక్షిణాది రాష్ట్రాలకే కేటాయించాలి. మిగిలిన సగాన్ని ఇతర రాష్ట్రాలకు జనాభా నిష్పత్తిలో కేటాయించవచ్చు. దక్షిణాదికి ఇచ్చే సీట్లను ఆయా రాష్ట్రాల GSDP, ఆర్థిక వృద్ధి రేటు ఆధారంగా పంపిణీ చేయాలి.
"కుటుంబ నియంత్రణ పాటించి అభివృద్ధి సాధించినందుకు దక్షిణాది రాష్ట్రాలకు శిక్ష వేయడం సరికాదు. ఈ అన్యాయాన్ని అడ్డుకోవడానికి మనమంతా ఏకతాటిపైకి రావాలి." అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన లేఖలో స్పష్టం చేశారు. మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ వంటి అంశాలను ముడిపెడుతూ కేంద్రం వ్యవహరిస్తున్న తీరును ఆయన తప్పుబట్టారు. ఈ కీలక అంశంపై దక్షిణాది ముఖ్యమంత్రుల స్పందన ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also:

