Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Sammakka Saralamma Jatara:తప్పిపోయే వారి కోసం రిస్ట్ బ్యాండ్లు

Sammakka Saralamma Jatara:తప్పిపోయే వారి కోసం రిస్ట్ బ్యాండ్లు

వార్త 4 months ago

Sammakka Saralamma Jatara: తెలంగాణలోని ప్రసిద్ధ మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరలో భక్తుల భద్రతను మరింత బలోపేతం చేసేందుకు రాష్ట్ర పోలీసులు కీలక చర్యలు చేపట్టారు.

జాతర సమయంలో తప్పిపోయే చిన్నారులు, దివ్యాంగులు త్వరగా తమ కుటుంబ సభ్యుల వద్దకు చేరేలా క్యూఆర్ కోడ్ ఆధారిత రిస్ట్ బ్యాండ్లను ప్రవేశపెట్టారు. ఈ వినూత్న కార్యక్రమాన్ని డీజీపీ శివధర్‌రెడ్డి ప్రారంభించారు.

చిన్నారుల భద్రతకు క్యూఆర్ కోడ్ రిస్ట్ బ్యాండ్లు

ఈ రిస్ట్ బ్యాండ్‌లో ఉన్న క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేస్తే, సంబంధిత చిన్నారి లేదా దివ్యాంగుడి తల్లిదండ్రుల పేరు, చిరునామా, సంప్రదింపు వివరాలు వెంటనే లభిస్తాయి. దీంతో పోలీసులు లేదా స్వచ్ఛంద సేవకులు వెంటనే కుటుంబ సభ్యులను సంప్రదించి, భద్రంగా అప్పగించే అవకాశం ఉంటుంది. దీనికోసం ప్రత్యేకంగా చిల్డ్రన్ ట్రాకింగ్ అండ్ మానిటరింగ్ సిస్టమ్ను కూడా అమలు చేస్తున్నారు.

ప్రతి ఏడాది లక్షలాది మంది భక్తులు మేడారం జాతరకు హాజరుకావడంతో, చిన్నారులు తప్పిపోయే ఘటనలు చోటుచేసుకుంటుంటాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర పోలీసులు తీసుకొచ్చిన ఈ సాంకేతిక ఆధారిత భద్రతా చర్య భక్తుల్లో ప్రశంసలు పొందుతోంది. మేడారం జాతరను సురక్షితంగా, సజావుగా నిర్వహించేందుకు ఈ రిస్ట్ బ్యాండ్లు కీలకంగా ఉపయోగపడనున్నాయి.

Read hindi news: hindi.vaartha.com

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha