Dailyhunt
సమ్మె బాట పట్టబోతున్న SBI ఉద్యోగులు !!

సమ్మె బాట పట్టబోతున్న SBI ఉద్యోగులు !!

వార్త 3 days ago

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగ సంఘాలు తమ న్యాయమైన డిమాండ్ల కోసం ఆందోళన బాట పట్టాయి. మే 25, 26 తేదీల్లో దేశవ్యాప్తంగా సమ్మె నిర్వహించనున్నట్లు ప్రకటించాయి.

ప్రధానంగా బ్యాంకులో గత కొంతకాలంగా వేధిస్తున్న సిబ్బంది కొరతను తీర్చాలని, పెన్షన్ సమస్యలను పరిష్కరించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. గతంలో కుదుర్చుకున్న ఒప్పందాలను అమలు చేయడంలో జాప్యం జరుగుతోందని, అందుకే 16 ప్రధాన డిమాండ్లతో ఈ నిరసన చేపడుతున్నట్లు AISBISF స్పష్టం చేసింది. ముఖ్యంగా మెసెంజర్లు, ఆర్మ్డ్ గార్డుల వంటి క్షేత్రస్థాయి సిబ్బంది నియామకాలను వెంటనే చేపట్టాలని వారు పట్టుబడుతున్నారు.

Read Also : విజయ్ గెలుపుతో శ్రీలంకలో సంబరాలు ఎందుకు

వరుస సెలవులు – బ్యాంకింగ్ సేవలకు బ్రేక్

మే నెల చివరి వారంలో ఈ సమ్మె జరగనుండటంతో సాధారణ బ్యాంకింగ్ సేవలకు భారీ అంతరాయం కలిగే అవకాశం ఉంది. సమ్మె జరగబోయే మే 25, 26 తేదీలకు ముందే 4వ శనివారం (మే 23), ఆదివారం (మే 24) సెలవులు ఉన్నాయి. దీనివల్ల వరుసగా నాలుగు రోజుల పాటు బ్యాంక్ శాఖలు మూతపడనున్నాయి. నగదు విత్‌డ్రా చేయడం, చెక్కుల క్లియరెన్స్, ఇతర కౌంటర్ సేవల కోసం వచ్చే కస్టమర్లు ఇబ్బందులు పడే అవకాశం ఉంది. మే 27న బ్యాంకులు తిరిగి తెరుచుకున్నా, అప్పటికే పెండింగ్‌లో ఉన్న పనుల వల్ల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.

అందుబాటులో డిజిటల్ సేవలు .. కస్టమర్లకు సూచనలు

బ్యాంక్ శాఖలు మూతపడినప్పటికీ, కస్టమర్ల సౌకర్యార్థం డిజిటల్ బ్యాంకింగ్ సేవలు యథావిధిగా కొనసాగుతాయని యూనియన్ వర్గాలు వెల్లడించాయి. ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ (YONO), మరియు యూపీఐ (UPI) లావాదేవీలకు ఎలాంటి ఆటంకం ఉండదు. అలాగే ఏటీఎంల ద్వారా నగదు ఉపసంహరణ సేవలు కూడా అందుబాటులో ఉంటాయి. అయితే, అత్యవసర బ్యాంకింగ్ పనులు ఉన్నవారు మే 22 లోపే పూర్తి చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. సమ్మె ప్రభావం డిజిటల్ సర్వీసులపై పడనప్పటికీ, బ్రాంచ్‌లలో నేరుగా చేసే పనులకు మాత్రం ఆ నాలుగు రోజులు విరామం తప్పదు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

మమతా ఓటమికి కారణం వారి ఓట్ల చిలికే !!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha