SBI Staff Strike: ప్రభుత్వ రంగం లో అతిపెద్ద బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఉద్యోగులు దేశవ్యాప్త సమ్మెకు సిద్ధమవుతున్నారు. ఈ నెల 25, 26 తేదీలలో సమ్మె నిర్వహించనున్నట్లు ఉద్యోగ సంఘాలు ప్రకటించాయి.
ఈ నేపథ్యంలో బ్యాంక్ కస్టమర్లకు ఎస్బీఐ కీలక విజ్ఞప్తి చేసింది. సమ్మె సమయంలో బ్యాంకింగ్ సేవల కోసం ప్రత్యామ్నాయ మార్గాలైన ఏటీఎంలు, కస్టమర్ సర్వీస్ పాయింట్లు (CSP), అలాగే యోనో (YONO) యాప్, నెట్ బ్యాంకింగ్, యూపీఐ (UPI) వంటి ఆన్‌లైన్ సేవలను వినియోగించుకోవాలని సూచించింది.
Read Also : Top 50 hottest : భారత్‌లో భానుడి భగ్గుమంటోంది.. టాప్ 50 హాటెస్ట్ నగరాలన్నీ ఇక్కడే
SBI employees to go on nationwide strike on 25th and 26th of this month
5 రోజుల పాటు నిలిచిపోనున్న సేవలు
SBI Staff Strike: దేశీయ బ్యాంకింగ్ వ్యవస్థలో దాదాపు ఐదో వంతు కార్యకలాపాలు ఒక్క స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారానే జరుగుతుంటాయి. దేశవ్యాప్తంగా ఎస్బీఐకి సుమారు 52 కోట్ల మంది ఖాతాదారులు ఉన్నారు. ఈ భారీ సమ్మె కారణంగా పెద్ద సంఖ్యలో కస్టమర్లపై ప్రభావం పడే అవకాశం ఉంది. అయితే, ఖాతాదారులకు అత్యవసర సేవలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసేందుకు దేశవ్యాప్తంగా ఉన్న 23,200 బ్యాంక్ శాఖల్లో అవసరమైన ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్బీఐ తన అధికారిక ‘ఎక్స్’ (ట్విట్టర్) ఖాతాలో పేర్కొంది.
వరుసగా 5 రోజుల పాటు బ్యాంకింగ్ సేవలు నిలిచిపోనున్నాయి. సమ్మెకు ముందు రోజులు నాలుగో శనివారం, ఆదివారం కావడం.. సమ్మె తర్వాత రోజు అంటే మే 27న చాలా రాష్ట్రాల్లో బక్రీద్ పండుగ సెలవు ఉండటమే ఇందుకు కారణం. దీంతో వరుస సెలవులు, సమ్మె వెరసి ఐదు రోజుల పాటు బ్యాంకులు పనిచేయవు.
ఉద్యోగ సంఘాల ప్రధాన డిమాండ్లు ఇవే
ఆలిండియా ఎస్బీఐ స్టాఫ్ ఫెడరేషన్ (AISBISF) ఆధ్వర్యంలో ఈ సమ్మె జరగనుంది. బ్యాంక్ శాఖల్లో సరైన సంఖ్యలో ఉద్యోగులు, మెసెంజర్లు, సాయుధ గార్డులను తక్షణమే నియామకం చేపట్టాలని వారు కోరుతున్నారు. వీటితో పాటు ఎన్పీఎస్ (NPS) ఉద్యోగులకు పెన్షన్ ఫండ్ మేనేజర్ ఎంపికను మార్చాలని, శాశ్వత ప్రాతిపదికన చేయాల్సిన ఉద్యోగాలను అవుట్‌సోర్సింగ్ అప్పగించడాన్ని పూర్తిగా నిలిపివేయాలని ఫెడరేషన్ డిమాండ్ చేస్తోంది. తమ డిమాండ్లు నెరవేర్చని పక్షంలో సమ్మెకు వెనకాడబోమని యూనియన్ స్పష్టం చేసింది.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :

