Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
సనాతన ధర్మాచరణే అనుసరణీయం!

సనాతన ధర్మాచరణే అనుసరణీయం!

వార్త 2 weeks ago

Sanatana Dharma : భారతీయ జనతా పార్టీలో (బిజెపి)లో ఉన్న వారంతా సనాతనులు కాదు. అలాగే సనాత నులు అంతా బిజెపి వారు కాదు. కొంచెం స్పష్టంగా చెప్పాలంటే బిజెపి రాజకీయ పార్టీ, అనేక రకాలైనవారు.

అనేక జీవన స్రవంతుల నుంచి వచ్చిన వారు, వేర్వేరు ప్రయోజనా లను ఆశించి వచ్చిన వారు ఆ పార్టీ లో ఉన్నారు. వీరిలో సనాతన ధర్మాన్ని నమ్మని వారు. ఆచరించనివారు కూడా ఉన్నారు. అలాగే సనాతన ధర్మాన్ని నమ్మినవారు ఇతర పార్టీలలో కూడా ఉన్నారు. భారత దేశంలో సనాతన ధర్మం గొప్పతనం ఇది. దేశంలోని జీవితానికి ఇది అద్దం పడుతుంది. ఏ పార్టీవారైనా, కులం వారైనా సనాతన ధర్మం ఆచరణ విషయంలో ఏకాభిప్రాయంలోనే యుగా లుగా సహజీవనం సాగిస్తున్నారు. ఈ సజీవ స్రవంతిని మార్చే శక్తి ఏదీ ఇప్పటివరకూ జనించలేదు. సనాతన ధర్మం అంటే అనేక అభిప్రాయాలున్నాయి. వివేచనను, నేర్చుకున్న జ్ఞానాన్ని బట్టి సనాతనం అనే పదానికి నిర్వ చనాలను వింటున్నాం, చూస్తున్నాం. ఎవరేం చెప్పినా పామరుల నుంచి పండితుల వరకూ హిందూ జీవన విధానం అంతా వేదాంత సారమైన సనాతనాన్నే అనుస రిస్తున్నారు. వేదాలు చదవని వారు సైతం తెలియకుండానే వేదాలు చెప్పే జీవన విధానాన్ని అనుసరిస్తున్నారు. ఇదే హిందూ జీవన విధానం. మనకు తెలియని, తెలిసిన చరిత్రల హిందూ జీవన విధానం అనేక మార్పులకు, సం ఘర్షణలకు లోనైంది.

 Sanatana Dharma

Sanatana Dharma : వేదాల నుంచి నేటి వరకూ

అనేక ప్రాంతీయ, జాతీయ, అంత ర్జాతీయ యుద్ధాలను చూసింది. జీవన విధానాలకు సం బంధించిన అనేక అంతర్గత సంఘర్షణలకు లోనైంది. కానీ అన్నింటికి మూలమైన వేదాల సారం ఈ కాల చక్రాన్ని నియంత్రిస్తూ వస్తోంది. ప్రపంచంలో అవినీతి, అక్రమాలు పెరిగిపోయినప్పుడు. ఆకలి దప్పులతో ఆరాచకాలతో, నియం తృత్వాలతో రాక్షస పాలనలో ప్రపంచం జీవనం గతి తప్పి నప్పుడు ప్రజలకు రుజుమార్గం చూపించడానికి ఒక అవతార పురుషుడు జన్మిస్తాడు. ఒక ప్రవక్త ఉదయిస్తాడు. సనాతన ధర్మంలో నాటి వేదాల నుంచి నేటి వరకూ ప్రపంచ గతిని, నాగరికతను సరైన మార్గంలో పెట్టడానికి సనాతన ధర్మం లో అవతారాలు ఉదయించడం కనిపిస్తుంది. ఒక్కో అవతా రం ఆ యుగంలో ప్రజలకు సరైన మార్గనిర్దేశం చేయడాన్ని చూస్తాం. సంభవామి యుగే యుగే అని గీతలో కృష్ణుడు చెప్పడం ఈ సనాతన ధర్మానికి పతాక శీర్షిక అని చెప్పాలి. ఇప్పుడు సనాతన ధర్మంలో బిజెపి పాత్ర ఏంటన్న ప్రశ్న గురించి కొద్దిగా మాట్లాడుకుందాం. దేశంలో గతంలో రాజ్యాలను ఏలిన రాజులకు సనాతన ధర్మానికి మధ్య సంబంధంలాంటిదే ఇది కూడా, సనాతన ధర్మ చరిత్రను పరిశీలిస్తే బిజెపి సముద్రంలో నీటి బిందువులాంటిది. యుగయుగాల చరిత్ర గతిలో రాజులు వచ్చిపోయారు. రాజ్యాలు ఎన్నో మారిపోయాయి. సనాతన ధర్మాన్ని పాటించిన రాజుల మనుగడ సాధించారు.

సమాజం నడతను మార్చే క్రమంలో

సనాతన ధర్మాన్ని అనుసరించిన రాజ్యాల చరిత్రలో నిలిచాయి. ఇప్పుడు ఆరెస్సెన్, బిజెపిలను హిందుత్వ పార్టీలు అంటు న్నారు. తప్పు లేదు. హిందుత్వాన్ని అనుసరించే వారిని హిందువులు, భారత దేశంలో ఉన్నవారిని భారతీయులు అనేకదా అంటారు. చరిత్రలో ఇతర మతాల నుంచి ననా తన ధర్మాన్ని కాపాడుకోడానికి యుద్ధాలు చేసిన రాజులు, జాతిని కాపాడుకోడానికి ప్రాణాలు అర్పించిన అమరవీరులు ఉన్నారు. వాళ్లు యుద్ధాలు చేసి, త్యాగాలు చేయకపోతే భరతమాతకు మరో వీరపుత్రుడో, వరపుత్రికో జనించేవారు. సంభవామి యుగే యుగే అనుకున్నాం కదా! వారిలాగే ఈరోజు ఆరెస్సెస్, బిజెపిలు, విహెచ్ పిలు “సనాతన ధర్మాన్ని కాపాడటానికి కృషి చేస్తున్నాం’ అని చెబుతు న్నాయి. వీరు చేస్తున్న కృషివల్ల భరతజాతి ఎంతవరకు తలెత్తుకుని నిలబడగలదో. భవిష్యత్తులో చరిత్ర చెప్పకనే దెబుతుంది. సమాజం నడతను మార్చే క్రమంలో అనేక తత్వశాస్త్రాలు పుట్టాయి. వీటిలో కొన్నింటిని తత్వ, ఆర్థిక శాస్త్రాలని, కొన్నింటిని మతాలని అంటున్నాం. వీటిలో సైన్స్ ఆధారంగా సమానత్వాన్ని బోధించే ఫిలాసఫీలు కూడా ఉన్నాయి. సైన్స్ భూమిపై జరిగే పరిణామాలకు వివరణ ఇవ్వగలదు. కాని పరిష్కారాలను సూచించలేదు. సాంఘిక, రాజకీయ జీవితం ఇలా ఉండాలని సైన్స్ నిర్దే శించలేదు. ఇక్కడ సైన్స్ ఫెయిల్యూర్ కనిపిస్తుంది, సైన్స్ శోధించలేనిది సనాతన ధర్మం చేయగలదు. విశ్వాన్ని సైతం యుగాల క్రితమే సనాతన ధర్మం శోధించింది. సత్యం కోసం రాజ్యాలను తృణప్రాయంగా త్యాగం చేసిన రాజు లను సనాతన హిందువుల్లో చూస్తాం.

 Sanatana Dharma

యుగధర్మం సనాతనం

ప్రపంచంలోని ఏ చరిత్రలోనూ ఈ ఉదాత్తత, ఔన్నత్యం కనిపించదు. పెద్ద లను, గురువులను గౌరవించడం ఇక్కడే ఉంది. అలాగే కుటుంబ బంధాలు, అనుబంధాలు సనాతన ధర్మంలోనే కనిపిస్తాయి. అందుకే ఈ ధర్మానికి ప్రపంచంలో అంతటి విశిష్ట స్థానం ఉంది. సనాతన ధర్మం తనను తాను సంస్క రించుకోగలదు. ఒకనాడు భారత స్త్రీ వంటింటి కుందేలు గానే ఉండాలనే సంప్రదాయం ఉండేది. ఇప్పుడు కుటుంబా న్ని ముందుకు నడిపించడంలో స్త్రీ ముందు ఉంటోంది. ఈ మార్పును సనాతనధర్మం ప్రకృతి సహజంగానే స్వీకరించిం ది. నేడు ఈ భారతావనిలో స్త్రీని దేవతగానే పూజిస్తారు. ప్రకృతిలో సగమైన స్త్రీకి ఏ ఇతర దేశంలోనూ భారతజాతి ఇచ్చిన గౌరవం ఇవ్వడం లేదు. సైన్స్ ఒక్కటి కాదు, తత్వ శాస్త్రం, ఖగోళ, ఆరోగ్య శాస్త్రాలతో సకల శాస్త్రాలతో మాన వాళికి భవిష్య మార్గం చూపించే యుగధర్మం సనాతనం. సనాతన ధర్మాన్ని అధ్యయనం చేయడానికి పండితులకి జీవితకాలం సరిపోని గ్రంథాలున్నాయి. ఈమధ్య కాలంలో మతం గురించి, సనాతన ధర్మం గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కారణం ఏంటి అన్న ప్రశ్నలు తలెత్త డం సహజం. ఇద్దరు వ్యక్తులు ఇరుగు పొరుగున ఉన్నారు. ఒక వ్యక్తి అదే పనిగా పక్కింటిపైకి రాళ్లు వేస్తున్నాడు. రెండో వ్యక్తి మనకెందుకులే అని కొంతకాలం మౌనంగా ఉన్నాడు. ఒక రోజు రెండో వ్యక్తి తనను రక్షించుకోడానికి రాళ్లు వేయడం మొదలు పెట్టాడు. ఘర్షణ మొదలైంది. ఇప్పుడు మనకు సోషల్ మీడియాలో ఈ యుద్ధమే కనిపి స్తోంది. సనాతన ధర్మాన్ని, చరిత్రను, సంస్కృతిని అవమాన పరుస్తూ ఎవరు మాట్లాడినా కొన్ని తరాలవారు మౌనంగా, సహనంతో భరించారు, తమ దేవుళ్లను ఎవరుతూలనాడినా సహించారు. కానీ ఈ తరంలో ఆ సహనం కనిపించడం లేదు. జెన్ తరం కదా! సనాతన ధర్మంపై దాడికి సరైన సమాధానం చెబుతున్నారు. అందుకే ఇంత కాలం తాము మాట్లాడిందే ధర్మమని ఏకపక్షంగా పిడివాదం చేసేవారు గుక్కపెట్టి సమాధానాలు వెదుక్కోవలసి వస్తోంది.

-సరికొండ రవింద్రనాథ్

Read hindi news : hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

హస్తకళలకు గ్లోబల్ గుర్తింపు: 'లేపాక్షి'లో క్యూఆర్ కోడ్ వ్యవస్థ ప్రారంభం!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha