Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
సనత్‌నగర్ కల్ట్ జిమ్‌లో వికృత భాగోతం!

సనత్‌నగర్ కల్ట్ జిమ్‌లో వికృత భాగోతం!

వార్త 2 months ago

Sanathnagar Gym Trainer Harassment | సనత్‌నగర్, జూన్ 13 వార్త : భాగ్యనగరంలోని సనత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర వేధింపుల ఉదంతం వెలుగుచూసింది.

విమానాలను నడిపే ఒక గౌరవప్రదమైన వృత్తిలో ఉన్న మహిళా పైలట్‌ను.. ఆమె వెళ్తున్న ప్రముఖ ‘కల్ట్’ (Cult) జిమ్ మేనేజర్ కమ్ ట్రైనర్ తన గర్ల్ ఫ్రెండ్‌తో కలిసి లైంగికంగా వేధించిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. జిమ్ ట్రైనింగ్ పేరుతో సదరు పైలట్‌ను లోబర్చుకునేందుకు వారు వేసిన వికృత ప్లాన్ విఫలం కావడంతో, సోషల్ మీడియా వేదికగా అసభ్యకర పోస్టులతో వేధింపులకు దిగారు.

Read Also: Golconda Murder: బావను చంపిన బావమరిది!

జిమ్ ట్రైనర్ వికృత ఫాంటసీ.. సహకరించిన ప్రియురాలు

పోలీసుల ఎఫ్‌ఐఆర్ వివరాల ప్రకారం.. సనత్‌నగర్ పరిధిలోని కల్ట్ జిమ్‌లో సంతోష్ గౌడ్ అనే వ్యక్తి మేనేజర్‌గా, ఫిట్‌నెస్ ట్రైనర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఆ జిమ్‌కు వస్తున్న మహిళా పైలట్‌పై సంతోష్ గౌడ్ కన్ను వేశాడు. ఆమెను శారీరకంగా లొంగదీసుకోవడానికి తన ప్రియురాలైన రజిని అనే మహిళతో కలిసి ఒక నీచమైన వ్యూహాన్ని రచించాడు. ఇద్దరు మహిళలతో ఒకేసారి ప్రైవేట్‌గా కలిసి ఉండటం సంతోష్ గౌడ్‌కు ఉన్న వికృత ఫాంటసీ (Fantasy) అని, అందుకు ఒప్పుకోవాలంటూ ప్రియురాలు రజిని స్వయంగా ఆ మహిళా పైలట్‌పై ఒత్తిడి తెస్తూ తీవ్రంగా వేధించడం మొదలుపెట్టింది.

ఇన్‌స్టాగ్రామ్‌లో అసభ్యకర మెస్సేజులు

ఈ వికృత ప్రతిపాదనను, వారి వేధింపులను సదరు మహిళా పైలట్ తీవ్రంగా నిరాకరించింది. తమ పప్పులు ఉడకకపోవడంతో సంతోష్ గౌడ్ రూటు మార్చాడు. ఆమెపై కక్ష పెంచుకుని సామాజిక మాధ్యమమైన ఇన్‌స్టాగ్రామ్ (Instagram) లో బాధితురాలిని టార్గెట్ చేశాడు. నకిలీ ఖాతాలను ఉపయోగించి ఆమె వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా అత్యంత అసభ్యకరమైన మెస్సేజులు, అసత్యపు పోస్టులు పెడుతూ మానసిక క్షోభకు గురిచేశాడు.

Sanathnagar Gym Trainer Harassment : రంగంలోకి సనత్‌నగర్ పోలీసులు - ఎఫ్‌ఐఆర్ నమోదు

ఈ సైబర్, లైంగిక వేధింపులను భరించలేకపోయిన బాధితురాలు చివరకు ధైర్యంగా సనత్‌నగర్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో రాతపూర్వకంగా ఫిర్యాదు చేసింది. కేసు తీవ్రతను బట్టి పోలీసులు జిమ్ మేనేజర్ సంతోష్ గౌడ్‌తో పాటు అతనికి సహకరించిన రజినిపై వివిధ నాన్-బెయిలబుల్ సెక్షన్ల కింద అధికారికంగా ఎఫ్‌ఐఆర్ (FIR) నమోదు చేశారు. మహిళల భద్రతకు భంగం కలిగించే ఇలాంటి సైకోల ప్రవర్తనపై పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. నిందితులను అదుపులోకి తీసుకునేందుకు ప్రత్యేక నిఘా పెట్టారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read also:

అల్వాల్‌లో విషాదం.. విద్యుత్ షాక్‌తో తండ్రి, కూతురు దుర్మరణం!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha