Sanathnagar TIMS: హైదరాబాద్‌లోని సనత్‌నగర్‌లో నిర్మిస్తున్న తెలంగాణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (TIMS) ఆసుపత్రికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, స్వాతంత్ర్య సమరయోధుడు డాక్టర్ మర్రి చెన్నారెడ్డి పేరును ఖరారు చేస్తూ తెలంగాణ రేవంత్ రెడ్డి సర్కార్ శుక్రవారం కీలక ఉత్తర్వులు జారీ చేసింది.
ఇది వరకు ఆస్పత్రి పేరు TIMS (Telangana Institute of Medical Sciences) అని ఉండగా పేరు మారుస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇకపై ఈ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని 'డాక్టర్ మర్రి చెన్నారెడ్డి తెలంగాణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్'గా పిలవనున్నారు. ఈ ఆస్పత్రిని పేద ప్రజలకు సూపర్ స్టెషాలిటీ వైద్య సేవలు అందించేందుకు ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వం నిర్మించింది.
తెలంగాణ ప్రాంతానికి, రాష్ట్ర రాజకీయ రంగానికి, ప్రజా వైద్య సేవలకు మాజీ సీఎం డాక్టర్ మర్రి చెన్నారెడ్డి అందించిన అమూల్యమైన సేవలను పురస్కరించుకుని ఆయన పేరును ఈ ప్రతిష్టాత్మక ఆసుపత్రికి పెట్టినట్లు ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.
Name of former CM Marri Chenna Reddy finalized for Sanathnagar TIMS
Sanathnagar TIMS: ఇన్‌ఛార్జ్ డైరెక్టర్‌గా నరేంద్రకుమార్
ఆసుపత్రి పాలన, పర్యవేక్షణ పనులను వేగవంతం చేసేందుకు గాను నరేంద్రకుమార్‌ను సనత్‌నగర్ టిమ్స్ ఇన్‌ఛార్జ్ డైరెక్టర్‌గా నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వైద్య సేవలను త్వరలోనే అందుబాటులోకి తీసుకురావడానికి రేవంత్ సర్కార్ వేగంగా అడుగులు వేస్తోంది. ఆసుపత్రి పూర్తి స్థాయి నిర్వహణ కోసం ఇటీవల 180 మంది డాక్టర్లు, సీనియర్ రెసిడెంట్లను కేటాయించారు. పూర్తి స్థాయి అధికారిక ప్రారంభోత్సవ ముహూర్తం త్వరలోనే వెలువడే అవకాశం ఉంది.

