Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
సంచలనం సృష్టింటించిన ట్విషా కేసు .. పోలీసులు ఏమన్నారంటే ?

సంచలనం సృష్టింటించిన ట్విషా కేసు .. పోలీసులు ఏమన్నారంటే ?

వార్త 3 months ago

Twisha Sharma case: దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన ట్విషా శర్మ మృతి కేసులో భోపాల్ పోలీసులు కీలక విషయాలను వెల్లడించారు. ఆమెది హత్య కాదని, అది స్పష్టంగా ఆత్మహత్యేనని పోలీసులు నిర్ధారించారు.

వరకట్నం కోసమే భర్త, అత్త కలిసి వేధించి చంపేశారని ట్విషా శర్మ కుటుంబ సభ్యులు తీవ్రంగా ఆరోపిస్తున్నప్పటికీ, పోలీసుల అధికారిక దర్యాప్తులో మాత్రం భిన్నమైన వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి.

నోయిడాకు చెందిన ట్విషా శర్మ మే 12న భోపాల్‌లోని తన అత్తింటిలో ఉరివేసుకుని చనిపోయారు. ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఆమె కుటుంబ సభ్యులు.. ట్విషా భర్త సమర్థ్ సింగ్, రిటైర్డ్ జడ్జి అయిన అత్త గిరిబాలా సింగ్‌లపై పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.

Read Also : Bapatla Crime:కన్న కొడుకే కాలయముడయ్యాడు.. రైలుపేటలో తీవ్ర కలకలం!

 The sensational Twisha case.. What did the police say?

Twisha Sharma case: రెండోసారి పోస్ట్‌మార్టంపై కమిషనర్ స్పష్టత

నోయిడాకు చెందిన ట్విషా శర్మ మే 12న భోపాల్‌లోని తన అత్తింటిలో ఉరివేసుకుని చనిపోయారు. ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఆమె కుటుంబ సభ్యులు.. ట్విషా భర్త సమర్థ్ సింగ్, రిటైర్డ్ జడ్జి అయిన అత్త గిరిబాలా సింగ్‌లపై పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. అయితే, ఆమె అత్త ట్విషాకు డ్రగ్స్ అలవాటు ఉందంటూ చేసిన ఆరోపణలను పోలీసులు పూర్తిగా ఖండించారు. భోపాల్ పోలీస్ కమిషనర్ సంజయ్ కుమార్ మాట్లాడుతూ, “పోస్ట్‌మార్టం నివేదిక, లభించిన సాక్ష్యాధారాల ప్రకారం ఇది ఖచ్చితంగా ఆత్మహత్యే. పోస్ట్‌మార్టంలో ఆమె డ్రగ్స్ తీసుకున్నట్లు ఎలాంటి ఆనవాళ్లు లభించలేదు” అని స్పష్టం చేశారు.

ఈ కేసు నమోదులో పోలీసులు జాప్యం చేశారంటూ వస్తున్న ఆరోపణలను కమిషనర్ సంజయ్ కుమార్ తోసిపుచ్చారు. అలాగే, ట్విషా మృతదేహానికి రెండోసారి పోస్ట్‌మార్టం నిర్వహించాలన్న కుటుంబ సభ్యుల డిమాండ్‌పై ఆయన స్పందిస్తూ.. అందుకు అనుమతి ఇచ్చే అధికారం పోలీసులకు లేదని, వారు న్యాయస్థానాన్ని ఆశ్రయించాల్సి ఉంటుందని సూచించారు. అయినప్పటికీ, కుటుంబ సభ్యుల అభ్యర్థన మేరకు రెండో పోస్ట్‌మార్టం అంశాన్ని తాము కేస్ డైరీలో పొందుపరిచామని ఆయన తెలిపారు. ప్రస్తుతం ఈ కేసులో ట్విషా భర్త సమర్థ్ పరారీలో ఉండగా, మరోవైపు కచ్చితంగా రెండోసారి పోస్ట్‌మార్టం జరగాల్సిందేనంటూ ట్విషా కుటుంబ సభ్యులు మృతదేహాన్ని తీసుకునేందుకు నిరాకరిస్తున్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

వాలీబాల్ నెట్ వైరుతో గొంతు నులిమి యువకుడి దారుణ హత్య!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha