Choutkur Village Development:సంగారెడ్డి జిల్లా చౌటుకూరు మండల కేంద్రంలో గ్రామపంచాయతీ పరిధిలో కొనసాగుతున్న అభివృద్ధి, పారిశుధ్య కార్యక్రమాలను ఎంపీడీవో శంకర్ తోపాటు డీఎల్‌పీవో అనిత రాథోడ్ పరిశీలించారు.
చౌట్కూర్ గ్రామపంచాయతీ కార్యాలయంతో పాటు పాఠశాలలు, అంగన్‌వాడీ భవనం, స్మశానవాటిక, రైతువేదిక తదితర ప్రాంతాలను ఎంపీడీవో సందర్శించి అక్కడి పరిస్థితులను పరిశీలించారు. ఆయా ప్రాంతాల్లో చేపడుతున్న పనులు, ప్రజలకు అందుతున్న సేవలపై అధికారులను, సిబ్బందిని అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా యూపీఎస్ పాఠశాలను సందర్శించిన ఎంపీడీవో శంకర్ తో డీఎల్ పి ఓ అనిత రాథోడ్ విద్యార్థులతో ముచ్చటించారు. పాఠ్యాంశాలకు సంబంధించిన ప్రశ్నలను విద్యార్థులను అడిగి వారి విద్యా ప్రమాణాలను పరిశీలించారు. విద్యార్థులు ఉత్సాహంగా సమాధానాలు చెప్పడంతో ఎంపీడీవో శంకర్అభినందించారు. విద్యార్థులు చదువుతో పాటు సాంస్కృతిక కార్యక్రమాల్లోనూ చురుకుగా పాల్గొనాలని సూచించారు.
Read also: Telangana degree colleges: ఇన్‌చార్జ్‌లతో పాలన.. విద్యార్థులకు తప్పని తిప్పలు

పాఠశాలలో విద్యార్థులతో ముచ్చటించిన అధికారులు
అనంతరం అంగన్‌వాడీ భవనాన్ని పరిశీలించిన ఆమె భవనం నిర్వహణ, పరిసరాల పరిశుభ్రతను పరిశీలించారు. అంగన్‌వాడీ భవనం చాలా చక్కగా నిర్మించి, పరిశుభ్రంగా నిర్వహిస్తున్నారని సర్పంచ్ పార్కల రాంరెడ్డిని అభినందించారు. అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులకు పౌష్టికాహారం, ప్రాథమిక విద్య, ఆరోగ్య పరిరక్షణ వంటి సేవలు సక్రమంగా అందేలా చూడాలని సూచించారు. గ్రామంలో పారిశుధ్య నిర్వహణపై కూడా వీడియో శంకర్ డీఎల్‌పీవో ప్రత్యేకంగా దృష్టి సారించారు. గ్రామంలోని ప్రధాన వీధులు, అంతర్గత రహదారులు, ప్రభుత్వ భవనాల పరిసరాలను పరిశీలించిన ఎంపీడీవో ఎటుచూసినా పరిశుభ్రత కనిపిస్తోందని ప్రశంసించారు. ప్రజల సహకారంతోనే గ్రామాన్ని మరింత పరిశుభ్రంగా, ఆదర్శవంతంగా తీర్చిదిద్దగలమని పేర్కొన్నారు. పారిశుధ్య కార్యక్రమాలను నిరంతరం కొనసాగించాలని గ్రామపంచాయతీ సిబ్బందికి సూచించారు. స్మశానవాటికను సందర్శించిన ఎంపీడీవో శంకర్ డీఎల్‌పీవో అక్కడి వసతులు, పరిసరాల నిర్వహణను పరిశీలించారు. రైతువేదికను కూడా పరిశీలించి రైతులకు అందుబాటులో ఉన్న సౌకర్యాలపై ఆరా తీశారు.

Choutkur Village Development:పరిశుభ్రతకు పెద్దపీట వేసిన గ్రామపంచాయతీ
రైతువేదికలను రైతుల సమావేశాలు, అవగాహన కార్యక్రమాలకు సమర్థవంతంగా వినియోగించుకోవాలని సూచించారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని చౌట్కూర్ యూపీఎస్ తో పాటు జిల్లా పరిషత్ ఉన్నంత పాఠశాలలో విద్యార్థులకు పాటల పోటీలు నిర్వహించేందుకు . ఈ పోటీల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను స్వతంత్ర దినోత్సవం రోజున వేడుకల రోజు విద్యార్థులకు బహుమతులు అందజేయాలని ఉపాధ్యాయులకు కోరారు గ్రామాభివృద్ధితో పాటు విద్య, పారిశుధ్యం, అంగన్‌వాడీ సేవలకు ప్రాధాన్యత ఇస్తున్న సర్పంచ్, పంచాయతీ సిబ్బందిని ఎంపీడీవో శంకర్ డీఎల్‌పీవో అనిత రాథోడ్ అభినందించారు.

ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా గ్రామంలో అభివృద్ధి, పారిశుధ్య కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా కొనసాగించాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీవో శంకర్ ఎంపీ ఓ సువర్ణ పంచాయతీ కార్యదర్శి సందీప్ గౌడ్ సర్పంచ్ పార్కల రాంరెడ్డి, వార్డ్ మెంబర్లు చక్రపాణి అశోక్ పాఠశాల ఉపాధ్యాయులు, సుభాష్ బాబు అంగన్‌వాడీ టీచర్ అనసూయ కాంగ్రెస్ నాయకులు రామా గౌడ్, రమేష్ రాజేశ్వర్ గౌడ్ కుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Epaper: epaper.vaartha.com

