Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
సంగారెడ్డి తార కాలేజీలో కలకలం.. విద్యార్థినిపై దాడి చేసి ఫోన్ చోరీ!

సంగారెడ్డి తార కాలేజీలో కలకలం.. విద్యార్థినిపై దాడి చేసి ఫోన్ చోరీ!

వార్త 2 weeks ago

Sangareddy: సంగారెడ్డి పట్టణంలోని ప్రముఖ తార ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తీవ్ర కలకలం రేపిన సంఘటన వెలుగుచూసింది. కళాశాల లైబ్రరీలో ఒంటరిగా ఉన్న ఓ విద్యార్థినిని ఇద్దరు ముసుగు దొంగలు బెదిరించి, దౌర్జన్యానికి పాల్పడి ఆమె సెల్ ఫోన్‌ను లాక్కెళ్లిన ఘటన స్థానికంగా భయాందోళనలు సృష్టించింది.

ఘటన పై బాధితురాలు అందించిన ఫిర్యాదు మేరకు సంగారెడ్డి పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Read Also:Chandragiri Accident: చంద్రగిరిలో బోల్తా పడిన పామాయిల్ ట్యాంకర్

Sangareddy: బాధితురాలి కథనం & పోలీసుల అనుమానాలు

పుల్కల్ మండలం మిన్పూర్ గ్రామానికి చెందిన ఓ యువతి సంగారెడ్డి తార డిగ్రీ కళాశాలలో బిజెడ్సి (BZC) రెండో సంవత్సరం చదువుతోంది. ఈ నెల 3న మధ్యాహ్నం 2:30 గంటల ప్రాంతంలో ఆమె లైబ్రరీలో ఒంటరిగా పుస్తకాలు చదువుకుంటోంది. ఆ సమయంలో ముఖానికి మాస్క్‌లు ధరించిన ఇద్దరు యువకులు లైబ్రరీలోకి ప్రవేశించి ఆమె వద్ద ఉన్న ఫోన్ ఇవ్వాలని బెదిరించారు. విద్యార్థిని నిరాకరించడంతో, వారు తీవ్రంగా దౌర్జన్యం చేసి ఆమె చేతులు కట్టేసి, నోట్లో బట్టలు కుక్కి కేకలు వేయకుండా చేశారు. అనంతరం ఆమె వద్ద ఉన్న సెల్ ఫోన్‌ను లాక్కొని అక్కడి నుంచి పరారయ్యారు. పగటిపూట కళాశాల ప్రాంగణంలోకి దుండగులు సునాయాసంగా ప్రవేశించి, లైబ్రరీలో విద్యార్థినిపై దాడి చేసి ఫోన్ ఎత్తుకెళ్లడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దుండగుల ఉద్దేశం కేవలం ఫోన్ చోరీ చేయడమేనా? లేక వెనుక వేరే ఏమైనా వ్యక్తిగత కక్షలు లేదా ఇతర కారణాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. కళాశాలలోని సీసీటీవీ కేమెరా ఫుటేజ్‌లను పరిశీలిస్తున్నారు.

Epaper: epaper.vaartha.com

మూడు నెలల పాపపై కిరాతకం

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha