Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మూడు నెలల పాపపై కిరాతకం

మూడు నెలల పాపపై కిరాతకం

వార్త 2 weeks ago

Mainpuri Incident:ఉత్తరప్రదేశ్ మైన్‌పురి జిల్లా పరిధిలో ఈ దారుణం జరిగింది. మంగళవారం రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న మూడు నెలల చిన్నారిని పొరుగింటి వ్యక్తి ఆడుకునే పేరుతో ఎత్తుకెళ్లాడు.

కుటుంబసభ్యులకు ముందే పరిచయం ఉన్న వ్యక్తి కావడంతో ఎవరూ అనుమానించలేదు. ఆ దుర్మార్గుడు పాపపై అరాచకానికి పాల్పడి తిరిగి మంచంపై పడుకోబెట్టి పారిపోయాడు.

Read also: PM Modi On World Crisis : అనిశ్చితి, సవాళ్ల మధ్య భారత్ ఆర్థిక వృద్ధి : ప్రధాని మోదీ

 Incident of rape of an infant

బాధితురాలి పరిస్థితి

చిన్నారి విపరీతంగా ఏడుస్తుండటంతో తల్లిదండ్రులు అనుమానం వచ్చి పరిశీలించారు. పాపకు తీవ్రంగా రక్తస్రావం కావడంతో కుటుంబ సభ్యులు హుటాహుటినా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం చిన్నారి వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతోంది. వైద్యులు పాప ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ తగిన వైద్యం అందిస్తున్నారు.

Mainpuri Incident:పోలీసులు స్పందన.. నిందితుడు అరెస్ట్

బుధవారం రోజు బాధితురాలి తండ్రి నేరుగా పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేశారు. నిందితుడు జితేంద్రను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. ఇలాంటి అరాచకాలకు పాల్పడే వారికి చట్టపరంగా కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.

Epaper: epaper.vaartha.com

విద్యార్థుల శ్రమకు చట్టబద్ధ రక్షణ కవచం!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha