Sanghamband Reservoir:సంఘంబండ రైట్ హై కెనాల్ కాల్వకు గండి చివరి యాయకట్టకు అందని సాగునీరు…. సాగునీటి కోసం రైతుల ఎదురుచూపు. అస్తవ్యస్తమైన కాలువలతో రైతు పొలంకు అందని సాగునీరు.
మధ్యలో ఇలా నీరు వృధా.. పట్టించుకోని సంబంధిత అధికారులు. సంఘంబండ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ రైట్ హై లెవెల్ కాల్వకు సోమవారం తెల్లవారుజామున నేరడగం శివారులో గండి పడింది. నీటి ప్రవాహానికి వర్కూర్ శివారులో ఉన్న దాదాపు 30 ఎకరాల పొలంలోకి నీరు చేరి పంటలకు నష్టం కలిగించిందని రైతులు వాపోతున్నారు. కాలువలు అస్తవ్యస్తంగా మారడంతో నీటి ప్రవాహం ముందుకు పోకుండా మధ్యలో ఇలా గండ్లు పడుతున్నాయని రైతులు చెబుతున్నారు.
Read also: Chicken waste seized: హైదరాబాద్‌లో 100 టన్నుల చికెన్ వ్యర్థాలు సీజ్
Sanghamband Reservoir:పూడికతీత పనులు లేక అడ్డుపడిన చెత్త
రైతులు మాట్లాడుతూ రిజర్వాయర్ రైట్ హై లెవెల్ కెనాల్ కాల్వకు గత కొన్ని సంవత్సరాలుగా మరమ్మత్తులు చేయడం లేదని, నామమాత్రకంగా పెరిగిన తుంగను అక్కడక్కడ తీసి వదిలేస్తున్నారని అన్నారు. పూర్తిస్థాయిలో కాలువ పూడిక తీయకపోవడంతో పంటలకు సరిపడా సాగునీరు అధికారులు విడుదల చేసినప్పుడు కాల్వలలో చెత్త చెదారం అడ్డుపడడంతో కాల్వ కోతకు గురై గండ్లు పడుతున్నాయని రైతులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.ఈ విషయాలపై పలుమార్లు సంబంధిత అధికారులక దృష్టికి తీసుకెళ్లిన ఏ ఒక్కరు పట్టించుకోవడంలేదని కాలువల వెంబడి బండి తోవలు కూడా చేసుకున్న సంఘటనలు ఉన్నాయని ఈ విషయాలపై ఏ ఒక్క అధికారి పట్టించుకోవడంలేదని రైతులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా గండీలను సరిచేసి సాగునీరు వృధాగా పారకుండా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. కాలువలు పూడికలు తీసి చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించాలని రైతన్నలు ఆకాంక్షిస్తున్నారు.
Epaper: epaper.vaartha.com

