Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
సంజీవ్ గోయెంకాపై లలిత్ మోడీ సంచలన వ్యాఖ్యలు!

సంజీవ్ గోయెంకాపై లలిత్ మోడీ సంచలన వ్యాఖ్యలు!

వార్త 1 week ago

Lalit Modi comments:ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోడీ సంజీవ్ గోయెంకాపై లలిత్ మోడీ విమర్శలు చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. లక్నో సూపర్ జెయింట్స్ టీమ్ ప్రదర్శనపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

యాజమాన్యం తీరు వల్ల జట్టు ఆటగాళ్లపై ఒత్తిడి పెరుగుతోందని, ఇది లీగ్ గౌరవాన్ని తగ్గిస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు. సరైన నాయకత్వం లేకపోవడం వల్లనే టీమ్ వరుసగా విఫలమవుతోందని ఆయన మండిపడ్డారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం క్రికెట్ అభిమానుల మధ్య పెద్ద చర్చకు దారితీశాయి. జట్టు యజమాని సంజీవ్ గోయెంకాను ‘చెత్త యజమాని’, ‘నిలకడ లేని వ్యక్తి’ అని ఆరోపించారు.

Read also: Team India New Zealand Tour: అక్టోబర్ నుండి న్యూజిలాండ్‌లో టీమ్ఇండియా సుదీర్ఘ పర్యటన.. షెడ్యూల్ ఇదే!

 Lalit Modi Criticizes Sanjiv Goenka

లక్నో జట్టు వైఫల్యాలపై లలిత్ మోడీ అసహనం

లక్నో సూపర్ జెయింట్స్ టీమ్ ప్రతి సీజన్‌లోనూ ఆశించిన స్థాయిలో రాణించలేకపోవడంపై లలిత్ మోడీ దృష్టి సారించారు. జట్టు యజమాని సంజీవ్ గోయెంకా నిర్ణయాలు అస్థిరంగా ఉంటాయని ఆయన ఆరోపించారు. ఒక బాధ్యతాయుతమైన యజమాని ఎలా ఉండాలో గోయెంకాకు తెలియడం లేదని, ఆయన తీరు టీమ్ భవిష్యత్తును దెబ్బతీస్తోందని విమర్శించారు. నిలకడ లేని నిర్ణయాల వల్ల ఆటగాళ్లు మైదానంలో ఇబ్బంది పడుతున్నారని, ఇది జట్టుకు పెద్ద మైనస్ అని ఆయన స్పష్టం చేశారు.

Lalit Modi comments:సోషల్ మీడియాలో ట్రోల్స్

సంజీవ్ గోయెంకా వ్యవహారశైలి సోషల్ మీడియాలో మీమ్ క్రియేటర్లకు మంచి ఫీడ్ ఇస్తోందని లలిత్ మోడీ ఎద్దేవా చేశారు. టీమ్ ఓనర్ ప్రవర్తన వల్ల లక్నో జట్టు అభిమానుల దృష్టిలో చులకనవుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. గతంలోనూ ఇలాంటి విమర్శలే చేసిన ఆయన, ఇప్పుడు మరోసారి తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. జట్టు గెలుపు కంటే యజమాని హడావుడి ఎక్కువైందని, ఇది ఐపీఎల్ రేటింగ్స్‌పై కూడా ప్రభావం చూపుతుందని లలిత్ మోడీ హెచ్చరించారు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

తొలి టెస్టుకు ఇంగ్లాండ్ 12 మంది జట్టు ఖరారు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha