ENG vs NZ: ఇంగ్లాండ్ వేసవి సీజన్‌కు ముహూర్తం ఖరారైంది. ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌లో ఎదురైన ఘోర పరాజయం తర్వాత ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు (Team England) తమ తొలి టెస్ట్ మ్యాచ్‌కు సిద్ధమైంది.
జూన్ 4 (గురువారం) నుండి లార్డ్స్ మైదానంలో న్యూజిలాండ్‌తో ప్రారంభం కానున్న తొలి టెస్టు కోసం ఇంగ్లండ్ మేనేజ్‌మెంట్ 12 మంది సభ్యుల బృందాన్ని అధికారికంగా ప్రకటించింది. ముఖ్య బౌలర్ జోఫ్రా ఆర్చర్‌కు ఈ మ్యాచ్‌లో విశ్రాంతి ఇవ్వగా, జట్టులోకి ఇద్దరు యువ అరంగేట్ర ఆటగాళ్లను ఎంపిక చేయడం విశేషం.
ENG vs NZ: జట్టులోకి ఇద్దరు యువ కిరాతకాలు
England vs New Zealand
ఇంగ్లాండ్ తన భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఈ సిరీస్ ద్వారా ఇద్దరు నూతన ఆటగాళ్లను టెస్ట్ ఫార్మాట్‌కు పరిచయం చేస్తోంది. డర్హమ్ కౌంటీ తరఫున ఆడుతున్న 26 ఏళ్ల ఈ లెఫ్ట్ హ్యాండ్ ఓపెనింగ్ బ్యాటర్ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. కౌంటీ సీజన్ ప్రారంభంలోనే 92 సగటుతో 3 సెంచరీల సాయంతో 554 పరుగులు చేసి సెలక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. రేపటి మ్యాచ్‌లో బెన్ డకెట్‌తో కలిసి ఈయన ఇన్నింగ్స్ ప్రారంభించడం ఖాయమైంది. హాంప్‌షైర్‌కు చెందిన 23 ఏళ్ల ఈ యువ ఫాస్ట్ బౌలర్ గంటకు 90 మైళ్ల వేగంతో (90mph) బౌలింగ్ చేయగలడు. 12 మంది సభ్యుల జట్టులో చోటు దక్కించుకున్న బేకర్.. పిచ్ పరిస్థితులను బట్టి తుది 11 మందిలో గస్ అట్కిన్సన్‌తో పోటీ పడనున్నాడు.
యాషెస్ ఓటమి తర్వాత తొలి పరీక్ష
కొన్ని నెలల క్రితం ముగిసిన యాషెస్ సిరీస్ దారుణ పరాభవం తర్వాత హెడ్ కోచ్ బ్రెండన్ మెకల్లమ్, కెప్టెన్ బెన్ స్టోక్స్ కాంబినేషన్‌లో ఇంగ్లాండ్ ఆడుతున్న మొదటి టెస్ట్ ఇదే కావడం గమనార్హం. సీనియర్ల స్థానంలో యువ రక్తానికి ప్రాధాన్యత ఇస్తూ ఈ 12 మంది జట్టును ఎంపిక చేశారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :

