PM Modi Praises Sanju: కేరళ అసెంబ్లీ ఎన్నికల వేడి పతాక స్థాయికి చేరిన వేళ, భారత స్టార్ క్రికెటర్ సంజూ శాంసన్‌ను ఉద్దేశించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు క్రీడా మరియు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యాయి.
ఐసీసీ ప్రపంచకప్ (World Cup) నాకౌట్ మ్యాచుల్లో సంజూ ప్రదర్శనను ఉదాహరణగా చూపుతూ, బీజేపీ కార్యకర్తల్లో ఉత్సాహం నింపే ప్రయత్నం చేశారు ప్రధాని.
Read Also:food security : 'ఆహారభద్రత'ను హరిస్తున్న యుద్ధం!
PM Modi Praises Sanju: కార్యకర్తలకు ‘సంజూ’ స్ఫూర్తితో పిలుపు
ప్రపంచకప్ నాకౌట్‌లో సంజూ చెలరేగి ఆడారు. అతడి ఏకాగ్రత, ఆత్మవిశ్వాసం మరింత బలపడ్డాయి. ఇవి నిజమైన క్రీడాకారుడి లక్షణాలు. జట్టుకు అవసరమైనప్పుడల్లా గొప్ప ఆటగాడు రాణిస్తాడు. అలానే ఓటింగ్ రోజున BJP కార్యకర్తలు ప్రతి ఇంటినీ చేరుకోవాలి. మీ అంకితభావం అత్యంత ముఖ్యం. విజయం కోసం అదనంగా పని చేయాలి' అని పిలుపునిచ్చారు.
PM Modi highlights Sanju Samson’s WC knockout performance
2026 టీ20 ప్రపంచకప్‌లో భారత్ విజేతగా నిలవడంలో సంజూ శాంసన్ కీలక పాత్ర పోషించాడు. ఈ టోర్నీలో మొత్తం 5 ఇన్నింగ్స్‌లలో 80.25 సగటు, 199.37 స్ట్రైక్ రేట్‌తో 321 పరుగులు సాధించి “ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్” అవార్డును గెలుచుకున్నాడు. ఇందులో 27 ఫోర్లు, 24 సిక్సులు ఉన్నాయి. ఈ ప్రదర్శనతో ఒకే టీ20 ప్రపంచకప్ ఎడిషన్‌లో అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాడిగా విరాట్ కోహ్లీ (2014లో 319 పరుగులు) రికార్డును శాంసన్ అధిగమించాడు.
టోర్నీ ఆరంభంలో రెండు మ్యాచ్‌లలో పెద్దగా రాణించకపోయినా, సూపర్-8 దశ నుంచి శాంసన్ చెలరేగిపోయాడు. వెస్టిండీస్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో అజేయంగా 97 పరుగులు చేసి జట్టును గెలిపించాడు. ఆ తర్వాత సెమీఫైనల్‌లో ఇంగ్లండ్‌పై 89, ఫైనల్‌లో న్యూజిలాండ్‌పై మరో 89 పరుగులతో జట్టు విజయంలో ముఖ్య భూమిక పోషించాడు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also:

