Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
సంక్షేమ పథకాల్లో డిజిటల్ కరెన్సీ..ఆర్బీఐ కీలక యోచన

సంక్షేమ పథకాల్లో డిజిటల్ కరెన్సీ..ఆర్బీఐ కీలక యోచన

వార్త 2 weeks ago

RBI: భారతదేశంలో డిజిటల్ చెల్లింపులను మరింత పటిష్టం చేసే దిశగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కీలక అడుగులు వేస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో పాటు రిటైల్ రంగానికి కూడా సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (CBDC) విస్తరించాలని ఆర్బీఐ యోచిస్తోంది.

దేశంలో డిజిటల్ కరెన్సీ వినియోగాన్ని విరివిగా పెంచడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆర్బీఐ తన తాజా వార్షిక నివేదికలో స్పష్టం చేసింది. ఈ వ్యూహంలో భాగంగా ప్రస్తుతం కొనసాగుతున్న పైలట్ ప్రాజెక్టును మరింత విస్తృతం చేయనున్నారు.

 e-Rupee Welfare Schemes

Read also: India mining news: భారత మైనింగ్ రంగం రికార్డు.. ఒక్క ఏడాదిలోనే 212 ఖనిజ బ్లాకుల వేలం.

గుజరాత్, పుదుచ్చేరిలలో పైలట్ ప్రాజెక్ట్ సక్సెస్

2025-26 ఆర్థిక సంవత్సరాల్లో గుజరాత్, పుదుచ్చేరి, చండీగఢ్ వంటి రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో నగదు బదిలీ (DBT) పథకాల కింద డిజిటల్ కరెన్సీని ఆర్బీఐ ప్రయోగాత్మకంగా పరిశీలించింది. ముఖ్యంగా ప్రజా పంపిణీ వ్యవస్థ (PDS) ద్వారా రేషన్ లబ్ధిదారులకు అందించే ఆహార సబ్సిడీలను ఈ సీబీడీసీ ద్వారానే విజయవంతంగా అందజేశారు.

RBI: దుర్వినియోగానికి చెక్.. దారి మళ్లని నిధులు

ఈ డిజిటల్ కరెన్సీ విధానం వల్ల ప్రభుత్వ నిధులు దుర్వినియోగం కాకుండా అడ్డుకోవచ్చు. పైలట్ ప్రాజెక్ట్‌లో భాగంగా లబ్ధిదారుల డిజిటల్ వాలెట్లలో జమ చేసిన నిధులను కేవలం రేషన్ షాపులు, లేదా ప్రభుత్వం ఎంపిక చేసిన నిర్దేశిత వ్యాపారుల వద్ద వస్తువుల కొనుగోలుకు మాత్రమే ఉపయోగించేలా పరిమితులు విధించారు. రాబోయే రోజుల్లో మరికొంత మంది భాగస్వాములను ఇందులో చేర్చాలని ఆర్బీఐ నిర్ణయించింది.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి అదిరిపోయే బైక్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha