Dailyhunt
సన్‎రైజర్స్ కు షాక్.. పవర్‌ప్లేలోనే అభిషేక్ శర్మ అవుట్

సన్‎రైజర్స్ కు షాక్.. పవర్‌ప్లేలోనే అభిషేక్ శర్మ అవుట్

వార్త 6 days ago

SRH vs KKR Live score: ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా కేకేఆర్‌తో జరుగుతున్న కీలక మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తొలి వికెట్ కోల్పోయింది. దూకుడుగా ఆడుతున్న ఓపెనర్ అభిషేక్ శర్మ తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరాడు.

Read Also:SRH vs KKR: టాస్ గెలిచిన సన్‌రైజర్స్

కార్తీక్ త్యాగి మ్యాజిక్

ఇన్నింగ్స్ ఆరంభం నుంచే కేకేఆర్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. ఈ క్రమంలో కార్తీక్ త్యాగి వేసిన అద్భుతమైన బంతికి అభిషేక్ శర్మ (15) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. పెవిలియన్ చేరే ముందు అభిషేక్ కొన్ని ఆకర్షణీయమైన షాట్లు ఆడినప్పటికీ, తన ఇన్నింగ్స్‌ను భారీ స్కోరుగా మలచలేకపోయాడు.

SRH vs KKR Live score: క్రీజులో హెడ్ విధ్వంసం

తొలి వికెట్ పడినా మరో ఎండ్‌లో ట్రావిస్ హెడ్ తనదైన శైలిలో విరుచుకుపడుతున్నాడు. ప్రస్తుతం హెడ్ 28 పరుగులతో క్రీజులో ఉండగా, అభిషేక్ అవుట్ అయిన తర్వాత క్రీజులోకి వచ్చిన ఇషాన్ కిషన్ 2 పరుగులతో నిలకడగా ఆడుతున్నాడు. వీరిద్దరూ కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే పనిలో పడ్డారు. సన్‎రైజర్స్ భారీ స్కోరు సాధించాలంటే ఈ జోడీ ఎక్కువ సేపు క్రీజులో ఉండటం జట్టుకు అత్యవసరం.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha