Pat Cummins: ఐపీఎల్ సీజన్‌లో భాగంగా అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్టుకు చేదు అనుభవం ఎదురైంది.
ఒకవైపు మ్యాచ్‌లో భారీ ఓటమి, మరోవైపు క్రమశిక్షణా చర్యల రూపంలో కెప్టెన్ ప్యాట్ కమిన్స్‌కు భారీ జరిమానా పడింది. ఐపీఎల్ చరిత్రలోనే తమ అతిపెద్ద ఓటముల్లో ఒకటిగా నిలిచిన ఈ మ్యాచ్, జట్టు నెట్ రన్ రేట్‌పై కూడా తీవ్ర ప్రభావం చూపింది.
Read Also: Pat Cummins: గుజరాత్ బౌలర్లకు పాట్ కమిన్స్ సలామ్.. SRH ఓటమికి అసలు కారణం ఇదే!
Cummins fined Rs. 12 lakh: Slow over rate effect
Pat Cummins: కెప్టెన్ కమిన్స్‌కు రూ. 12 లక్షల జరిమానా
మ్యాచ్ ఓటమి బాధలో ఉన్న హైదరాబాద్‌కు స్లో ఓవర్ రేట్ రూపంలో మరో దెబ్బ తగిలింది. నిర్ణీత సమయంలో ఓవర్లను పూర్తి చేయలేకపోయినందుకు ఐపీఎల్ యాజమాన్యం కెప్టెన్ ప్యాట్ కమిన్స్‌కు రూ. 12 లక్షల జరిమానా విధించింది. ఈ సీజన్‌లో సన్‌రైజర్స్‌కు ఇది మొదటి తప్పిదం కావడంతో కేవలం కెప్టెన్‌పై మాత్రమే జరిమానాతో సరిపెట్టారు. మళ్ళీ ఇలాంటి తప్పు రిపీట్ అయితే జట్టులోని ఇతర సభ్యులపై కూడా కోత పడే అవకాశం ఉంది.
కుప్పకూలిన బ్యాటింగ్..
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్, సాయి సుదర్శన్, వాషింగ్టన్ సుందర్ రాణించడంతో 168 పరుగులు చేసింది. క్యాన్సర్ అవగాహన కోసం లావెండర్ జెర్సీలతో బరిలోకి దిగిన గుజరాత్ బౌలర్లు, ఆపై హైదరాబాద్ బ్యాటర్లను వణికించారు. 169 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఎస్ఆర్‌హెచ్, కేవలం 14.5 ఓవర్లలో 86 పరుగులకే కుప్పకూలింది. ఈ భారీ పరాజయంతో నెట్ రన్ రేట్ దారుణంగా పడిపోయింది. రాబోయే మ్యాచ్‌లలో భారీ విజయాలు సాధిస్తే తప్ప సన్‌రైజర్స్ టాప్-2లోకి వెళ్లడం కష్టంగా మారనుంది.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also:

