IND-W vs SA-W: భారత మహిళల జట్టు దక్షిణాఫ్రికా పర్యటన ఓటమితో ప్రారంభమైంది. ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా డర్బన్‌లోని కింగ్స్‌మీడ్ వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 6 వికెట్ల తేడాతో భారత్‌పై ఘనవిజయం సాధించింది.
తద్వారా సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.
Read Also:LizLaz: కోహ్లీని చూస్తే జాలి వేస్తోంది.. ఇన్‌స్టా లైక్ వివాదంపై స్పందించిన లిజ్‌లాజ్
IND-W vs SA-W: రాణించిన హర్మన్, షెఫాలీ
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది.భారత బ్యాటర్లలో హర్మన్ ప్రీత్ కౌర్ (47 నాటౌట్; 33 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్), జెమీమా రోడ్రిగ్స్ (36; 29 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్), ఫెఫాలీ వర్మ (34; 20 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్) లు రాణించారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో అయబోంగా ఖాకా మూడు వికెట్లు తీసింది. తుమీ సెఖుఖునే రెండు వికెట్లు పడగొట్టింది. ఎలంబా ఓ వికెట్ సాధించింది.
India Women vs South Africa Women T20
అనంతరం కెప్టెన్ లారా వోల్వార్ట్ (51; 39 బంతుల్లో 8 ఫోర్లు) హాఫ్ సెంచరీ చేయగా అన్నేరీ డెర్క్సెన్ (44; 34 బంతుల్లో 4 ఫోర్లు, 1సిక్స్) రాణించడంతో 158 పరుగుల లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా మహిళల జట్టు 19.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. భారత బౌలర్లలో శ్రేయాంకా పాటిల్ రెండు వికెట్లు తీసింది. అరుంధతి రెడ్డి, శ్రీచరణి చెరో వికెట్ పడగొట్టారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also:

