List of Voters : ఎట్టకేలకు ఓటర్ల జాబితా సమగ్ర సవరణ (సర్)కు పూర్తిస్థాయి చట్టబద్ధత లభించింది. నిష్పక్షపాత ఎన్నికల నిర్వహణకు రాజ్యాంగం నిర్దేశించిన ఆదేశిక సూత్రాలకు ఈప్రక్రియ జీవం పోస్తుందని వ్యాఖ్యానిం చింది.
ఎన్నో అనుమానాలు, అపార్థాలు ఎన్నో అవ రోధాలు, ఆందోళనల మధ్య’సర్’ ప్రక్రియ ఎన్నో మార్పు లు, సూచనలు సలహాలతో ఒక పటిష్టమైన ఓటరు గుర్తింపు ప్రక్రియ రూపు దాల్చినట్లుగా ఉంది. ‘సర్’ ప్రక్రియలో పారదర్శకత లోపించిందని కేవలం విపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలలో ఆయా పక్షాలను ఓటమి పాలు చేయడానికే ఈ ప్రక్రియ ఉపయోగ పడ్తోందని, ఎన్నో అనుమానాలతో విపక్షాలు చాలా కాలంగా రాద్దాం తం చేస్తున్నాయి. నిన్నమొన్నటి వరకు బీహార్లో పశ్చిమ బెంగాల్, తమిళనాడు ఎన్నికల్లో ఒకే రకమైన ఆరోప ణలు, రచ్చ అన్నీ పూర్తయ్యాక తాజాగా శంఖంలో పోసిన తీర్థం మాదిరి ‘సర్’ ప్రక్రియ పరమపవిత్ర ఎన్నికల ప్రక్రియ, ప్రస్తుత ప్రజాస్వామ్య వ్యవస్థకు అత్యంత ఆవశ్యకమేనని సుప్రీం ధర్మాసనం భాష్యం చెప్పింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 324, ప్రజాప్రాతి నిధ్య చట్టంలోని 21(3) ప్రకారం ఓటర్ల జాబితాలో ప్రత్యేక సవరణలు చేపట్టేందుకు ఎన్నికల కమిషన్కు ప్రత్యేక అధికారాలు ఉన్నట్లు ధర్మాసనం ధృవీకరించింది.
Read Also : 8th Central Pay Commission:కేంద్ర ఉద్యోగులకు 8వ వేతన సంఘం గుడ్ న్యూస్!
List of Voters
List of Voters : కొన్ని రాష్ట్రాల్లో నిరసన శబ్దాలు
బీహార్ లో ‘సర్’ ప్రక్రియను సవాల్ చేస్తూ దాఖలైన పలు పిటిషన్లపై పూర్తి స్థాయి విచారణ అనంతరం ఎన్నికలు స్వేచ్ఛాయుతంగా, నిష్పక్షపాతంగా జరపాలన్న రాజ్యాంగ నిర్దేశిత సూచనలను ముందుకు తీసుకెళ్తుంది. ఈ ప్రక్రి యలో ఏ చట్టమూ ఉల్లంఘనకు నోచుకోలేదు. ఏరాజ్యాం గ నిబంధనకూ వ్యతిరేకంగా జరుగలేదని ధర్మాసనం స్పష్టంగా పేర్కొంది. స్వేచ్ఛాయుత, నిష్పాక్షిక ఎన్నికల నిర్వహణ ‘సర్’ జీవనాడి వంటిదని సుప్రీం కోర్టు తీర్పు వచ్చాక కూడా కొన్ని రాష్ట్రాల్లో నిరసన శబ్దాలు తలె త్తాయి. ఆంధ్రప్రదేశ్లోనూ, మరికొన్ని రాష్ట్రాల్లోనూ బిజెపి నెగ్గేందుకు ‘సర్’ ముందు వచ్చిన విమర్శల బాపతు టక్కుటమార గోకర్ణ విద్యలకేమీ ఆసా్కర ముండని విధంగా కన్నేసి ఉంచాలని కొన్ని ప్రాంతీయ పార్టీలు చప్పుడు చేశాయి. నిజానికి సుప్రీంకోర్టు స్పష్టం చేసిన అంశాలపై మరో మాటమాట్లాడేందుకు ఎవరూ సాహసించరు. ‘సర్’ను ఆట పట్టించే విపక్షాలు ఇక పైనున్నా గొంతు సవరించుకోవడం మంచిది. ఎన్నికలో ఓటింగ్ యంత్రాలు, వివిప్యాట్ స్లిప్ల విషయంలో ఆరోపణలొచ్చి దశాబ్ద కాలమైనా వాటిపైన ఇంకా పలు చోట్ల చర్చోపచర్చలు జరుగుతూనే ఉన్నాయి. వాటిలో లోపాలున్నాయని గెలిచిన వారు, ఓడిన వారి మధ్య మాటలు అటూ ఇటూ మారుతుంటాయి. అలాంటి పరిస్థితులు ‘సర్’ విషయంలో రారాదు. ‘సర్’ విషయంలో సుప్రీం ధర్మాసనమిచ్చిన తీర్పుతో తాము గౌరవ ప్రదంగా ఏకీభవించలేక పోతున్నట్లు కాంగ్రెస్ చెప్పనే చెప్పింది. ‘సర్’ ప్రక్రియ అమలు నేపథ్యంలో విస్తృతంగా అనుమాన పడిన అంశాల్లో ఓటు పౌరసత్వం లింక్పై ధర్మాసనం స్పష్టంగా చెప్పడమొక్కటే కాస్త ఊరట కలిగించే విషయం.
ఓటర్ల జాబితా సవరణ
ఓటరు జాబితా ద్వారా ఒక వ్యక్తి పౌరసత్వాన్ని అంతిమంగా నిర్ధారించే అధికారం ఎన్నికల కమిషన్కు లేదని స్పష్టంగా పేర్కొంది. గుర్తింపు కార్డుల విషయంలో ధర్మాసనం పలు మార్గదర్శకాలిచ్చినట్లే మరికొన్ని అంశాల విషయంలో ఓటరుకు పలు ఉపశమనాలివ్వడం విశే షం. ప్రపంచంలోనే అత్యంత విశ్వసనీయమైన అత్యద్భు త ఓటర్ల జాబితా సవరణ ఏదైనా ఉందంటే అది తమ దేనని కాలర్ ఎగరేసి చెప్పుకునేందుకు కేంద్ర ఎన్నికల కమిషనర్కు పట్టు చిక్కింది. ఓటర్ల జాబితా సవరణ అనగానే ఎన్నికలు వచ్చే ముందు రోజుల్లో పలకరించి వెళ్లే ప్రక్రియ కాదని, దానిలోనూ చెప్పుకోదగిన మతలు బులున్నాయని విపక్షాలు కోడైకూసాయి. ఈ ప్రక్రియకు ఇటీవలనే సుప్రీం ధర్మాసనం కితాబివ్వడంతో చట్టబద్ధత ఏర్పడినట్లయింది. కేవలం సెక్యులర్ ఓటర్లను ఓటర్ల జాబితాలో కొన్నివర్గాలపై, వారి వలసలపై, వారి జాతు లపై వచ్చిన విమర్శలు, వారి వ్యవహారాలు వాటన్నిటి పై లేవనెత్తిన సందేహాలకు ఆదిలో సరైన జవాబులు దొరక్క విపక్షాలు ఎన్నికల కమిషనర్పై ఆగ్రహోద్రగ్యులయ్యా యి. న్యాయసమ్మతమైన ఓటర్ల జాబితా సవరణ జరగక పోతే ప్రతిపక్ష సానుభూతిపరులు ఓట్లకే ఎసరు పెడ్తుం టారని అందుకే తమ ఓటర్లను కాపాడుకునేందుకు తరచు ఎన్నికల కమిషన్తో విపక్షాలు తగవుకు దిగాయి. పలు సందర్భాల్లో విపక్షాల నిరసన గొంతు వినపడింది కూడా. వివిధ సీజన్లలో పనిపాటల కోసం పొరుగూర్లకు వెళ్లే వారి ఓటర్ల పేర్లను కూడా తీసేయడం మొదట్లో కొంత అలజడి సాగింది. అలా ఏదో కారణం చూపిన ఎత్తున ఓటర్లకు ఓటు హక్కు లేకుండా చేస్తున్నారని గుసగుసలు బయలుదేరాయి.
List of Voters
ఘనత నిలబెట్టుకుంది
ఇటీవల జరిగిన పశ్చిమబెంగాల్ ఎన్ని కల్లో 90 లక్షలకుపైగా ఓట్లను తొలగించి, కేవలం 30 లక్షల ఓటర్లను వెరిఫికేషన్ తర్వాత చేర్చుకొన్నారు. ఈ కారణం చేతనే తృణమూల్ పార్టీ ఘోర పరాజయం పొందిందన్న అప్రపధనెదుర్కొంది. ఒకసారి బీహార్లో ఎంతో స్వచ్చంగా సమగ్రంగా ఓటర్ల జాబితా కూర్పు జరిగి ఎన్నికలు సజావుగా పూర్తయ్యాయన్న ప్రశంసలు పొందిన ఎన్నికల కమిషన్ తదనంతరం పశ్చిమ బెంగా ల్ నుంచి అదే మాదిరి ఆదేశాలతో ముందడుగువేసింది. ఎన్నికల కమిషన్ ఒకపక్క ఆరోపణల మెట్టునూ ఎక్కి అగ్నీ పరీక్షలో గెలిచింది. ‘సర్’ ప్రక్రియ జరిగిన రాష్ట్రా ల్లో తమ హక్కును నిరూపించేందుకు ఓటర్లకు ఎన్నో కష్టాలుపడాల్సి వచ్చింది. ఎన్నో ఆపసోపాలు పడినాకేంద్ర ఎన్నికల సంఘం బీహార్, పశ్చిమబెంగాల్, తమిళనాడు ఎన్నికలను గట్టెకించింది. ‘సర్’కు ధర్మాసనం ఇచ్చిన చట్టబద్ధత, ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల నిర్వహణ అనం తరం సిఇసి తన ఘనత నిలబెట్టుకుంది.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also:

