Lenovo Innovation World 2026: ప్రముఖ టెక్ దిగ్గజం లెనోవో (Lenovo) తమ అంతర్జాతీయ ప్రదర్శన 'ఇన్నోవేషన్ వరల్డ్ 2026' వేదికగా అధునాతన ల్యాప్‌టాప్‌ల శ్రేణిని పరిచయం చేసింది.
తమ లైనప్‌ను మరింత విస్తరిస్తూ IdeaPad Vibe 14, Vibe 15 తో పాటు ప్రొఫెషనల్స్ కోసం ThinkBook 14 Gen 9, ThinkBook 14x Gen 2 మోడళ్లను మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ మోడళ్లన్నీ శక్తివంతమైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సామర్థ్యాలు, నెక్స్ట్-జనరేషన్ ప్రాసెసర్లు మరియు స్లిమ్ అండ్ ప్రీమియం డిజైన్‌తో వినియోగదారుల ముందుకు రానున్నాయి.
Read Also :Motorola Razr Swarovski Edition: మోటరోలా కొత్త ఫోల్డబుల్ ఫోన్ లాంచ్.. ధర, ఫీచర్ల వివరాలు!

Lenovo Innovation World 2026: ఐడియాప్యాడ్ వర్సెస్ థింక్‌బుక్: ఏ మోడల్‌లో ఏ ప్రాసెసర్?
- IdeaPad Vibe 14 & Vibe 15: 14 అంగుళాలు మరియు 15 అంగుళాల డిస్‌ప్లే ఆప్షన్లలో లభించే ఈ ఐడియాప్యాడ్ వైబ్ సిరీస్ ల్యాప్‌టాప్‌లలో Snapdragon X లేదా AMD Ryzen AI 400 సిరీస్ ప్రాసెసర్లను అమర్చారు. ఇవి విద్యార్థులు, క్రియేటర్లకు AI టాస్క్‌లు మరియు మల్టీటాస్కింగ్ కోసం ఎంతగానో ఉపయోగపడతాయి.
- ThinkBook 14 Gen 9: బిజినెస్ యూజర్లను లక్ష్యంగా చేసుకుని రూపొందించిన ఈ మోడల్‌లో అత్యంత వేగవంతమైన Snapdragon X2 Plus ప్రాసెసర్‌ను అందించారు.
- ThinkBook 14x Gen 2: అత్యుత్తమ పెర్ఫార్మెన్స్ కోరుకునే వర్కింగ్ ప్రొఫెషనల్స్ కోసం రూపొందించిన ఈ ప్రీమియం ల్యాప్‌టాప్‌లో Intel Core 7 Series 3 ప్రాసెసర్‌ను ఉపయోగించారు.

