Dailyhunt
సర్జరీ తర్వాత తొలిసారి బయటకు వచ్చిన పవన్.. మనోహర్ కుటుంబానికి పరామర్శ

సర్జరీ తర్వాత తొలిసారి బయటకు వచ్చిన పవన్.. మనోహర్ కుటుంబానికి పరామర్శ

వార్త 4 days ago

Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేనాని పవన్ కల్యాణ్ శస్త్రచికిత్స అనంతరం మంగళవారం తొలిసారిగా బయటకు వచ్చారు. ఇటీవల కన్నుమూసిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు నివాసానికి వెళ్లిన ఆయన, భాస్కరరావు చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.

గత నెల 22న నాదెండ్ల భాస్కరరావు కన్నుమూసిన సమయంలో పవన్ కల్యాణ్ సైనస్ సమస్యకు శస్త్రచికిత్స చేయించుకుని విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆ సమయంలో అంత్యక్రియలకు హాజరుకాలేకపోయిన పవన్, భాస్కరరావు కుమారుడు, తన చిరకాల మిత్రుడు, రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్‌కు ఫోన్ చేసి పరామర్శించారు. తాజాగా ఆరోగ్యం కుదుటపడటంతో మంగళవారం నేరుగా నాదెండ్ల నివాసానికి వెళ్లి మనోహర్, ఆయన కుటుంబ సభ్యులను కలిసి ధైర్యం చెప్పారు.

Read Also : Anantha Babu: ఎమ్మెల్సీ అనంతబాబును కస్టడీలోకి తీసుకున్న పోలీసులు!

 Minister Nadendla Manohar and family members are consulted.

Pawan Kalyan: సైనస్ సర్జరీ తర్వాత సాధారణ స్థితిలోకి..

కొంతకాలంగా సైనస్ సమస్యతో బాధపడుతున్న పవన్ కల్యాణ్, శస్త్రచికిత్స చేయించుకుని దాదాపు రెండు వారాల పాటు విశ్రాంతి తీసుకున్నారు. చాలా రోజుల తర్వాత తమ నేత సాధారణ స్థితిలో కనిపించడంతో జనసేన కార్యకర్తలు, పవన్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

నాదెండ్ల భాస్కరరావు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన నేత. ఆయన కుటుంబంతో పవన్ కల్యాణ్‌కు ఉన్న ఆత్మీయ బంధం నేపథ్యంలో, పవన్ స్వయంగా వెళ్లి పరామర్శించడం రాజకీయంగానూ చర్చనీయాంశమైంది.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

ఏపీలో టాటా పవర్ భారీ పెట్టుబడి

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha