Survey : తెలంగాణలో తాజాగా విడుదలైన కుల గణన సర్వే రాష్ట్ర రాజకీయాలు, సామాజిక చర్చలకు కొత్త దిశను చూపిస్తోంది. దశాబ్దాలుగా 'డేటా లేకపోవడం' అనే కార ణంతో నిలిచిపోయిన అనేక వాదనలు ఇప్పుడు స్పష్టమైన గణాంకాలతో ముందుకు వస్తున్నాయి.
ఈ నేపథ్యంలో సహజంగానే ఒక ప్రశ్న బలంగా వినిపిస్తోంది. కులగణన తర్వాత రిజర్వేషన్లు మారుతాయా? ఈ ప్రశ్నకు సరళమైన సమాధానం లేదు. ఎందుకంటే, రిజర్వేషన్లు అనేవి కేవలం జనాభా నిష్పత్తి ఆధారంగా ఇవ్వబడే విధానం కాదు. భారత
రాజ్యాంగం ప్రకారం, రిజర్వేషన్ల లక్ష్యం సామాజిక విద్యా వెనుకబాటుతనాన్ని సరిచేయడం. అంటే, ఒక కులం జనాభా ఎక్కువగా ఉందని మాత్రమే దానికి అధిక రిజర్వేషన్ఇవ్వడం సాధ్యం కాదు. అయితే, కుల గణన ద్వారా బయటపడిన వాస్తవాలు మాత్రం గంభీరమైనవే. రాష్ట్రంలో వెనుకబడిన వర్గాల సంఖ్య గణనీయంగా ఉందని, ఇంకా అనేక కులాలు అభివృద్ధి ఫలితాల నుంచి దూరంగా ఉన్నాయని ఈ సర్వే సూచి స్తోంది.
Read Also: Oil Crisis: ముగిసిన రష్యా చమురు ఆంక్షల మినహాయింపు గడువు.. సామాన్యుడి బడ్జెట్‌పై తీవ్ర ప్రభావం
Survey
Survey : వెనుకబడిన వారికి ప్రత్యేక అవకాశాలు
ముఖ్యంగా, ఒకే వర్గంగా పరిగణించబడుతున్న బీసీలలో కూడా తీవ్రమైన అసమానతలు ఉన్నాయని స్పష్టమవుతోంది. కొంతమంది మాత్రమే అవకాశాలను పొందుతుండగా, మరికొందరు ఇంకా వెనుకబడే పరిస్థితి కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో రిజర్వేషన్లపై చర్చపెంచాలా? తగ్గించాలా? అన్న దానికంటే, ఎలా సమర్థవంతంగా అమలు చేయాలి? అన్న దిశగా మళ్లా ల్సిన అవసరం ఉంది. ఇక్కడే ‘సబ్కటగిరైజేషన్’ అనే ఆలోచన పాముఖ్యత సంతరించుకుంటుంది. అంటే, ఒక పెద్ద వర్గాన్ని చిన్న భాగాలుగా విభజించి, అందులో నిజంగా వెనుకబడిన వారికి ప్రత్యేక అవకాశాలు కల్పించ డం. ఇది అమలు చేస్తే, ఇప్పటివరకు లాభం పొందని వర్గాలకు న్యాయం జరిగే అవకాశం ఉంది. మరోవైపు, రిజర్వేషన్ల పెంపు విషయంలో న్యాయపరమైన పరిమి తులు కూడా ఉన్నాయి. సుప్రీంకోర్టు నిర్ణయించిన 50 శాతం పరిమితి పెద్ద అడ్డంకిగా నిలుస్తోంది. ఈ పరిమి తిని దాటాలంటే ప్రత్యేక చట్టపరమైన చర్యలు, బలమైన డేటా ఆధారాలు అవసరం. కాబట్టి, కేవలం కులగణన ఆధారంగా వెంటనే రిజర్వేషన్లు పెంచడం సాధ్యమయ్యే పని కాదు. ఇక రాజకీయ కోణంలో చూస్తే, ఈ సర్వే ప్రభావం ఎంతో ఉంటుంది. పెద్ద సంఖ్యలో ఉన్న వర్గాలు తమ హక్కుల కోసం మరింత గట్టిగా డిమాండ్ చేసే అవకాశం ఉంది.
Survey
సరైన దిశలో నిర్ణయాలు
రాజకీయ పార్టీలు కూడా ఈ వర్గాలను ఆకర్షించడానికి కొత్త హామీలు ఇవ్వవచ్చు. దీంతో, రాబోయే ఎన్నికల్లో కుల ఆధారిత రాజకీయాలు మరింత ప్రాధాన్యం పొందే అవకాశం ఉంది. అయితే, ఈ పరిస్థితిలో ఒక ముఖ్యమైన అంశాన్ని మరవకూడదు రిజర్వేషన్లు మాత్రమే సామాజిక న్యాయానికి పూర్తి పరిష్కారం కావు. విద్య, ఉపాధి, ఆరోగ్యం, ఆర్థిక అవకాశాలు వంటి రంగాల్లో సమగ్ర అభివృద్ధి లేకపోతే, కేవలం కోటాల పెంపుతో సమస్యలు పరిష్కరించలేము. కాబట్టి, ప్రభుత్వం కుల గణనను ఒక ప్రారంభంగా తీసుకుని, దీర్ఘకాలిక సంక్షేమ విధానాలను రూపొందించాలి. మొత్తం మీద, తెలంగాణ కుల గణన ఒక కీలక మలుపు. ఇది సమాజంలోని అస మానతలను బయటపెట్టింది. కానీ, రిజర్వేషన్లు వెంటనే మారుతాయా అంటే అది అనేక చట్టపరమైన, రాజకీయ, సామాజిక అంశాలపై ఆధారపడి ఉంటుంది. సరైన దిశలో నిర్ణయాలు తీసుకుంటే, ఈ సర్వే సామాజిక న్యాయానికి బలమైన పునాది అవుతుంది. లేకపోతే, ఇది మరో రాజకీయ చర్చగా మిగిలిపోవడం తప్పదేమో.
-ఎలబోయిన వెంకటేశ్వర్లు
Read hindi news : hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also:

