Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
సతీసమేతంగా శ్రీశైలం మల్లన్నను దర్శించుకున్న కేంద్రమంత్రి

సతీసమేతంగా శ్రీశైలం మల్లన్నను దర్శించుకున్న కేంద్రమంత్రి

వార్త 2 weeks ago

Srisailam News:శ్రీశైలం మల్లన్నను సోమవారం నాడు ఉదయం కేంద్ర బొగ్గు మరియు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి సతీ సమేతంగా శ్రీ స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు.

ముందుగా ఆలయం వద్దకు చేరుకున్న వారికి కార్యనిర్వహణాధికారి యం.శ్రీనివాసరావు, అర్చక స్వాములు, ఆలయ అధికారులు సాదరముగా స్వాగతం పలికారు. అనంతరం వీరు శ్రీస్వామిఅమ్మవార్లను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. దర్శనాంతరము అమ్మవారి ఆలయ ప్రాకార మండపంలో వేద పండితులు వేదాశీర్వచనము వల్లించగా, అర్చక స్వాములు తీర్థ ప్రసాదాలను అందజేశారు. తదుపరి ఆల ఈవో శేషవస్త్రాల తో సత్కరించి లడ్డు ప్రసాదాలను అందజేశారు. తదుపరి శ్రీస్వామిఅమ్మవార్ల చిత్రపటము బహుకరించారు.

Read also: TDP MLA Chintamaneni Prabhakar : అర్ధరాత్రి నడిరోడ్డుపై ఎమ్మెల్యే వీరంగం

 Union Minister Kishan Reddy visits Srisailam

Srisailam News:ఘనంగా స్వాగతం పలికిన ఆలయ అధికారులు

శ్రీశైలం పుణ్యక్షేత్రానికి చేరుకున్న కిషన్ రెడ్డికి కార్యనిర్వహణాధికారి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో అధికారులు స్వాగతం పలికారు. ఆలయ సంప్రదాయం ప్రకారం అర్చకులు పూర్ణకుంభంతో ఆహ్వానం పలికారు. ముందుగా స్వామివారిని, ఆపై అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు పూర్తి చేశారు. గర్భాలయం ముందు క్షేత్ర పాలకుడికి మొక్కులు చెల్లించుకుని భక్తిభావంతో ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

దువ్వూరులో రిటైర్డ్ టీచర్ ఫ్యామిలీ ఆత్మహత్య!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha