Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Security Summit: పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ కు చేదు అనుభవం

Security Summit: పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ కు చేదు అనుభవం

వార్త 4 months ago

పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్ జర్మనీలో జరిగిన మ్యూనిచ్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్‌కు(Security Summit) హాజరయ్యారు. అయితే సదస్సు ప్రాంగణంలోకి ప్రవేశించే సమయంలో భద్రతా సిబ్బంది ఆయనను ఆపివేశారు.

గుర్తింపు కార్డు చూపించాలని కోరుతూ పూర్తి వివరాలు అడిగారు. ఆయన ఐడీ కార్డును పరిశీలించిన తర్వాతే లోనికి అనుమతి ఇచ్చారు.

ప్రొటోకాల్ ఉల్లంఘనగా పాక్ అసంతృప్తి

ఈ ఘటనను పాకిస్తాన్ ప్రొటోకాల్ ఉల్లంఘనగా భావిస్తూ అసంతృప్తి వ్యక్తం చేసింది. భద్రతా తనిఖీ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సెక్యూరిటీ(Security Summit) అధికారి ఆయనను అతిథిగా కాకుండా సాధారణ వ్యక్తిగా భావించడం వల్లే ఈ సంఘటన జరిగిందని అంతర్జాతీయ వెబ్‌సైట్‌లు తెలిపాయి.

భిన్న స్పందనలు - అవమానం కాదన్న మాజీ అధికారి

ఈ ఘటనపై పాకిస్తాన్ మాజీ మిలిటరీ అధికారి ఆదిల్ రజా స్పందిస్తూ ఇది అవమానం కాదని వ్యాఖ్యానించారు. అంతర్జాతీయ వేదికలపై ప్రతి ఒక్కరికీ అధికారిక తనిఖీ తప్పనిసరి అని, మునీర్ అంతగా ప్రపంచవ్యాప్తంగా పరిచయం కాకపోవడం వల్ల భద్రతా సిబ్బంది గుర్తించలేకపోయారని అన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha