Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Steering wheels: వాహన భద్రతపై చైనా సంచలన నిర్ణయం

Steering wheels: వాహన భద్రతపై చైనా సంచలన నిర్ణయం

వార్త 4 months ago

వాహన భద్రత విషయంలో ప్రపంచ దేశాలకు మార్గదర్శకంగా నిలవాలనే లక్ష్యంతో చైనా ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. రోడ్డు ప్రమాదాల్లో ప్రాణ నష్టం తగ్గించాలన్న ఉద్దేశంతో ఇప్పటికే కొన్ని డిజైన్ మార్పులను నిషేధించిన చైనా, తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకుంది..ఆధునిక కార్లలో విస్తృతంగా ఉపయోగిస్తున్న హాఫ్ స్టీరింగ్ వీల్స్‌ (Steering wheels) ను పూర్తిగా బ్యాన్ చేస్తూ కఠిన భద్రతా ప్రమాణాలను అమలు చేయనుంది.

ప్రమాదాల్లో డ్రైవర్లకు తగిలే గాయాల్లో 46% స్టీరింగ్ వ్యవస్థ కారణమవుతోంది. హాఫ్ స్టీరింగ్ వల్ల తీవ్రత పెరుగుతోంది. యాక్సిడెంట్లలో ఫ్లష్ హ్యాండిల్స్‌ తెరుచుకోని ఘటనలు ఎక్కువయ్యాయి. దీంతోనే వాటిని బ్యాన్ చేసింది.

TamilNadu: మహిళ స్నానం చేస్తుండగా వీడియో తీసిన యువకుడి అరెస్ట్!

తప్పకుండా నియమాలు పాటించాల్సిందే

ఇప్పటికే ఫ్లష్ డోర్ హ్యాండిల్స్ నిషేధించిన చైనా, ఇప్పుడు యోక్ స్టైల్ హాఫ్ స్టీరింగ్ వీల్స్ సైతం నిషేధించింది. భద్రతా నియమాలను అంతర్జాతీయ ప్రమాణాలకు సరిపోలేలా కఠినతరం చేయడం, ప్రయాణికులకు రక్షణ కల్పించడమే ఈ నిషేధాల వెనుక ఉన్న ప్రధాన ఉదేశ్యం.హాఫ్ స్టైల్ స్టీరింగ్ వీల్ ను టెస్లా ప్రారంభించింది. ఆ తరువాత చాలా చైనీస్ కంపెనీలు ఇలాంటి స్టైల్ ఫాలో అయ్యాయి. ఇలాంటి స్టీరింగ్ వీల్ (Steering wheels) వల్ల చాలా నష్టాలు ఉన్నాయని ఆటోమొబైల్ నిపుణులు చెబుతున్నారు.

రోడ్డు ప్రమాదాల్లో డ్రైవర్లకు కలిగే గాయాలలో సుమారు 46 శాతం స్టీరింగ్ వ్యవస్థ కారణంగా సంభవిస్తున్నాయి. కొత్త ప్రమాణాల ప్రకారం.. 2027 నుంచి చైనాలో అమ్మకానికి వచ్చే కొత్త కార్లు హాఫ్ స్టైల్ స్టీరింగ్ వీల్ పొందకూడదు. అంతే కాకుండా.. ఇలాంటి స్టైల్ స్టీరింగ్ వీల్ కలిగిన వాహనాల్లో కూడా చేంజ్ చేసుకోవడానికి 13 నెలల గడువు ఇచ్చింది. దీన్నిబట్టి చూస్తే.. కార్లను తప్పకుండా నియమాలను పాటించాల్సిందే అని అవగతం అవుతోంది.

Read hindi news: hindi.vaartha.com

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha