Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
సెక్రటేరియట్ వద్ద ఉద్రిక్తత.. కవితను అదుపులోకి తీసుకున్న పోలీసులు

సెక్రటేరియట్ వద్ద ఉద్రిక్తత.. కవితను అదుపులోకి తీసుకున్న పోలీసులు

వార్త 3 months ago

Kalvakuntla Kavitha: తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లోని సెక్రటేరియట్ వద్ద గురువారం భారీ ఉద్రిక్తత చోటుచేసుకుంది. రాష్ట్రంలో రైతుల నుంచి ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలంటూ తెలంగాణ రక్షణ సేన (TRS) అధ్యక్షురాలు కవిత ఆధ్వర్యంలో ఆ పార్టీ శ్రేణులు ధర్నాకు దిగారు.

సచివాలయం పరిసరాల్లోకి పెద్ద ఎత్తున చేరుకున్న పార్టీ కార్యకర్తలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో అక్కడ కాసేపు గందరగోళ పరిస్థితి నెలకొంది.

Read Also : Kharif season seeds: నకిలీ విత్తనాలపై పోలీసుల ఉక్కుపాదం!

 Tension at the Secretariat.. Police take Kavitha into custody

Kalvakuntla Kavitha: ధాన్యంలో తరుగు తీయవద్దు..

టీఆర్ఎస్ అధ్యక్షురాలు కవిత మాట్లాడుతూ.. రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లలో జరుగుతున్న జాప్యం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యానికి సంబంధించి ఎలాంటి తరుగు తీయకూడదని, తక్షణమే అన్నదాతలకు మద్దతు ధర కల్పించి న్యాయం చేయాలని ఆమె డిమాండ్ చేశారు. రైతుల పక్షాన తాము పోరాటం చేస్తామని, ప్రభుత్వం స్పందించే వరకు వెనక్కి తగ్గేదే లేదని స్పష్టం చేశారు.

కవితతో సహా నేతలు అదుపులోకి

సెక్రటేరియట్ వంటి అత్యంత భద్రతా ప్రాంతంలో అనుమతి లేకుండా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ కవిత టీఆర్ఎస్ శ్రేణులు ధర్నాకు దిగడంతో అలర్ట్ అయిన పోలీసులు రంగంలోకి దిగారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా నిరసనకారులను అడ్డుకున్నారు. రోడ్డుపై బైఠాయించిన కవితతో పాటు ధర్నాలో పాల్గొన్న ఇతర ముఖ్య నాయకులను, మహిళా కార్యకర్తలను పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. వారిని అక్కడి నుంచి పోలీస్ వాహనాల్లో స్థానిక పోలీస్ స్టేషన్లకు తరలించారు. కల్వకంట్ల కవిత ‘తెలంగాణ రక్షణ సేన’ (TRS) పేరుతో సరికొత్త రాజకీయ పార్టీని ప్రకటించిన సంగతి తెలిసిందే. కొత్త పార్టీని స్థాపించినప్పటి నుంచి ఆమె నిరంతరం ప్రజా సమస్యలపైనే ప్రధానంగా దృష్టి సారిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న ప్రధాన రాజకీయ పార్టీలకు గట్టి పోటీ ఇచ్చేలా ఆమె వరుస నిరసన కార్యక్రమాలు, మీడియా సమావేశాలు నిర్వహిస్తూ ప్రజల్లో ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా రాష్ట్రంలో నెలకొన్న ధాన్యం కొనుగోళ్ల సమస్యపై రైతుల పక్షాన నిలిచి సచివాలయం ముట్టడికి యత్నించడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

ఘోరం ..ఇన్సూరెన్స్ డబ్బుల కోసం భార్య ను కొట్టి చంపి.. ఆపై ఆత్మహత్య చిత్రీకరణ!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha