IPL 2026 News : కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (104) అద్భుత సెంచరీతో కదం తొక్కడంతో ఐపీఎల్ 2026 ఫైనల్లోకి గుజరాత్ టైటాన్స్ ఘనంగా ప్రవేశించింది. ముల్లన్‌పూర్‌లో జరిగిన క్వాలిఫయర్-2 మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌ను 7 వికెట్ల తేడాతో ఓడించింది.
215 పరుగుల భారీ లక్ష్యాన్ని గుజరాత్ కేవలం 18.4 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 219 పరుగులు చేసి ఛేదించింది.
గిల్-సుదర్శన్ రికార్డు భాగస్వామ్యం
ఈ విజయవంతమైన ఛేదనలో శుభ్‌మన్ గిల్ ప్రారంభం నుంచి చివరి వరకు నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చాడు. కేవలం 53 బంతుల్లో 15 ఫోర్లు, 3 సిక్సర్లతో 104 పరుగులు చేసి ప్రత్యర్థి బౌలర్లపై పూర్తి ఆధిపత్యం చెలాయించాడు. అతనికి ఓపెనర్ సాయి సుదర్శన్ (58) అద్భుత సహకారం అందించాడు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 167 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నమోదు చేసి మ్యాచ్‌ను పూర్తిగా గుజరాత్ వైపు తిప్పేశారు. అయితే 32 బంతుల్లో 58 పరుగులు చేసిన సుదర్శన్ దురదృష్టవశాత్తూ హిట్ వికెట్‌గా పెవిలియన్ చేరాడు.
Read Also : హార్దిక్ పాండ్యాపై ముంబై ఇండియన్స్ వేటు?
ఐపీఎల్ చరిత్రలో అరుదైన రికార్డు
ఈ మ్యాచ్‌లో సాయి సుదర్శన్ ఒక అనవసరమైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. బ్రిజేష్ శర్మ బౌలింగ్‌లో (IPL 2026 News) భారీ షాట్ ఆడే ప్రయత్నంలో అతని చేతిలోంచి బ్యాట్ జారి వికెట్లపై పడింది. దీంతో అంపైర్ హిట్ వికెట్‌గా ప్రకటించాడు. అంతకుముందు బెంగళూరుతో జరిగిన క్వాలిఫయర్-1 మ్యాచ్‌లో కూడా సుదర్శన్ ఇదే తరహాలో హిట్ వికెట్‌గా ఔటయ్యాడు. దీంతో ఐపీఎల్ చరిత్రలో వరుసగా రెండు ఇన్నింగ్స్‌ల్లో హిట్ వికెట్ అయిన తొలి బ్యాటర్‌గా నిలిచాడు. అతని ఔట్ చూసిన నాన్‌స్ట్రైకర్ శుభ్‌మన్ గిల్ నిరాశతో మైదానంలోనే మోకాళ్లపై కూర్చోవడం అభిమానుల దృష్టిని ఆకర్షించింది. మరోవైపు రాజస్థాన్ తరఫున వైభవ్ సూర్యవంశీ 96 పరుగులతో మెరిసినా, గుజరాత్ విజయాన్ని అడ్డుకోలేకపోయాడు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :
RR-GT మ్యాచ్ టాస్ సమయంలో తీవ్ర గందరగోళం!

