Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
సేంద్రియ వ్యవసాయమే రైతుకు భవిష్యత్‌ భరోసా

సేంద్రియ వ్యవసాయమే రైతుకు భవిష్యత్‌ భరోసా

వార్త 2 weeks ago

Kalyandurgam Khet Bachao Abhiyan: కృషి విజ్ఞాన కేంద్రం, కళ్యాణదుర్గంలో భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో 'కేత్ బచావో అభియాన్' కార్యక్రమం గురువారం నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి కిసాన్ మోర్చా నాయకుడు శ్రీ ఆంజనేయులు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా విస్తరణ విభాగం శాస్త్రవేత్త డాక్టర్ బాలాజీ నాయక్ మాట్లాడుతూ రైతులు పొలం సంరక్షణ, మిశ్రమ పంటల సాగు, జీవన ఎరువుల వినియోగం, ప్రకృతి వ్యవసాయ పద్ధతులపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు సాధించే విధానాలను రైతులు అవలంబించాలని పిలుపునిచ్చారు. అలాగే కేంద్ర ప్రభుత్వం గత 12 సంవత్సరాలుగా రైతుల సంక్షేమం కోసం అమలు చేస్తున్న వివిధ పథకాలు, వ్యవసాయాభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించారు.

Read also: Gade Sai Krishna Missing Case: సాయికృష్ణ కేసుతో రాజకీయ కలకలం.. జూన్ 29న హైకోర్టు డెడ్‌లైన్‌పై ఉత్కంఠ!

 Organic farming is the assurance of a future for farmers.

Kalyandurgam Khet Bachao Abhiyan: రసాయన ఎరువుల తగ్గింపు – ప్రకృతి వ్యవసాయ ప్రోత్సాహం

కిసాన్ మోర్చా నాయకుడు ఆంజనేయులు మాట్లాడుతూ రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించి ప్రకృతి, సేంద్రియ వ్యవసాయ విధానాలను ప్రోత్సహించాలని రైతులకు సూచించారు. రైతుల ఆదాయాన్ని పెంచే దిశగా కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. రాష్ట్ర బీజేపీ కౌన్సిల్ సభ్యుడు ఆంజనేయులు, జిల్లా బీజేపీ ఉపాధ్యక్షుడు ఎం. దేవరాజు, ఎస్‌ఆర్ కౌన్సిల్ ఉపాధ్యక్షుడు బి. మల్లారెడ్డి, కంబదూరు, సెట్టూరు మండలాల పార్టీ నాయకులు రైతులను ఉద్దేశించి ఆధునిక, ప్రకృతి ఆధారిత సాగు విధానాలపై అవగాహన కల్పించారు.

ప్రకృతి వ్యవసాయ విభాగం మాస్టర్ ట్రైనర్ శివశంకర్ మాట్లాడుతూ చీడపీడల నివారణకు ఉపయోగపడే వివిధ రకాల సహజ కషాయాల తయారీ విధానాలను రైతులకు వివరించారు.ఈ కార్యక్రమంలో శాస్త్రవేత్తలు డాక్టర్ ఎం. మల్లికార్జున (వ్యవసాయ విభాగం), డాక్టర్ వి. యుగంధర్ (ఉద్యాన విభాగం), డాక్టర్ ఎం. హరిణి (పశువైద్య విభాగం) రైతులకు పంటల నిర్వహణ, ఉద్యాన పంటల సాగు, పశుసంవర్థక రంగంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనలు అందించారు. వివిధ గ్రామాల నుంచి వచ్చిన రైతులు, రైతు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read also:

సాయికృష్ణ మిస్సింగ్ కేసుపై అంబటి సంచలన వ్యాఖ్యలు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha