Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
సెప్టెంబర్ 1 నుంచి మారనున్న 5 కీలక నిబంధనలు

సెప్టెంబర్ 1 నుంచి మారనున్న 5 కీలక నిబంధనలు

వార్త 3 weeks ago

New Rules: సెప్టెంబర్ 1వ తేదీ నుంచి దేశంలో సాధారణ ప్రజల రోజువారీ ఖర్చులు, బ్యాంకింగ్, పన్నులు మరియు ప్రయాణాలకు సంబంధించిన అనేక కీలక నిబంధనల్లో మార్పులు రానున్నాయి.

వీటిని ముందే తెలుసుకోవడం ద్వారా అనవసర సమస్యలు మరియు ఆర్థిక నష్టాల నుంచి తప్పించుకోవచ్చు.

Read Also :Gold Rate Today: స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు

New Rules: సెప్టెంబర్ 1 నుంచి మారే 5 ప్రధాన నిబంధనలు

  • 1. ఎల్పీజీ (LPG) ఈ-కేవైసీ గడువు: ఎల్పీజీ వినియోగదారులు తమ కనెక్షన్‌కు ఈ-కేవైసీ (e-KYC) పూర్తి చేసేందుకు ఆగస్ట్ 31 చివరి తేదీ. గడువు దాటితే సెప్టెంబర్ 1 నుంచి గ్యాస్ సేవల్లో ఇబ్బందులు రావచ్చు.
  • 2. ఎల్పీజీ గ్యాస్ ధరల సవరణ: ప్రతి నెలా ఒకటో తేదీన ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు కొత్త గ్యాస్ ధరలను ప్రకటిస్తాయి. గృహ వినియోగ, కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ల కొత్త ధరలు సెప్టెంబర్ 1న వెల్లడవుతాయి.
  • 3. ఆర్‌బీఐ కొత్త ఎఫ్‌డీ (FD) నిబంధనలు: రూ.3 కోట్లు లేదా అంతకంటే ఎక్కువ విలువైన ఫిక్స్‌డ్ డిపాజిట్ల వడ్డీ రేట్లను బ్యాంకులు ఉదయం 10:10 గంటల కల్లా వెబ్‌సైట్‌లో ప్రకటించాలి. ఒకే రోజు వేర్వేరు బ్రాంచుల్లో వేర్వేరు రేట్లు మార్చడాన్ని ఆర్‌బీఐ నిషేధించింది.
  • 4. ఐటీఆర్ (ITR) దాఖలు ముగింపు: ఆడిట్ అవసరం లేని వ్యక్తులు 2026-27 అసెస్‌మెంట్ సంవత్సరానికి సంబంధించి ఐటీఆర్ దాఖలు చేయడానికి ఆగస్ట్ 31 ఆఖరి తేదీ.
  • 5. విమానాశ్రయాల్లో నో-స్టాంపింగ్ విధానం: అంతర్జాతీయ ప్రయాణికులకు ఇమిగ్రేషన్ కౌంటర్ల వద్ద బోర్డింగ్ పాస్‌పై స్టాంప్ వేసే విధానాన్ని సెప్టెంబర్ 1 నుంచి పునఃసమీక్షించి రద్దు చేస్తున్నారు. ఫోన్‌లోని కాపీ లేదా ప్రింటెడ్ కాపీ చూపిస్తే సరిపోతుంది.

లాభాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha