Save the Tigers 3: డిస్నీప్లస్ హాట్‌స్టార్‌లో సెన్సేషనల్ కామెడీ హిట్‌గా నిలిచిన 'సేవ్ ది టైగర్స్' సిరీస్.. సరికొత్త కథాంశంతో మూడో సీజన్‌కు సిద్ధమైంది.
భార్యాబాధితులుగా మారిన ముగ్గురు మిత్రుల కామెడీ ట్రాక్‌తో ఇప్పటికే రెండు సీజన్లు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకోగా, ఇప్పుడు తాజాగా ‘సీజన్ 3’ కి సంబంధించిన క్రేజీ ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ సరికొత్త సీజన్ జూన్ 19 నుంచి ఓటీటీలో సందడి చేయనుంది.

హిలేరియస్‌గా సాగుతున్న ట్రైలర్.. వెన్నెల కిషోర్ ఎంట్రీతో ఫాంటసీ ట్విస్ట్!
“పెళ్లి గురించి మనకు చిన్నప్పటి నుంచి అబద్ధాలే చెప్పారు” అంటూ అభినవ్ గోమటం చెప్పే ఫన్నీ డైలాగ్‌తో ట్రైలర్ ఇంట్రెస్టింగ్‌గా స్టార్ట్ అవుతుంది. ఎప్పటిలాగే పెళ్లి తర్వాత భార్యలతో పడుతున్న కష్టాలను ఘంటా రవి (ప్రియదర్శి), రాహుల్ (అభినవ్), విక్రమ్ (చైతన్య కృష్ణ) తమదైన శైలిలో వెళ్లబోసుకుంటారు. అయితే, “మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అన్న వాడు దొరికితే నరుకుతా” అని ఒకరు అనగానే.. స్వర్గలోకంలో దేవేంద్రుడిగా వెన్నెల కిషోర్ ఎంట్రీ ఇవ్వడం ఈ సీజన్‌కు పెద్ద హైలైట్‌గా నిలిచింది.
Read also:Yami Gautam: నమ్మకం లేని కథలకు 'నో' చెప్పడం వల్లే ఈ స్థాయికి చేరాను
ఆ తర్వాత ఈ ముగ్గురు స్నేహితుల లైఫ్స్ ఊహించని విధంగా టర్న్ అవుతాయి. ఒకరు ఎమ్మెల్యేగా, మరొకరు ఫేమస్ రైటర్‌గా, ఇంకొకరు పెద్ద కంపెనీకి సీఈవోగా మారిపోతారు. ఇదంతా నిజంగానే జరిగిందా? లేక దేవేంద్రుడి మహత్యమా? అనే సస్పెన్స్, కామెడీని ఈసారి నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది.
Save the Tigers 3: అలరించడానికి సిద్ధమైన పాత ముఠా.. సరికొత్త వినోదం!
ఈ సిరీస్‌లో లీడ్ రోల్స్ చేసిన ప్రియదర్శి, అభినవ్ గోమటం, చైతన్య కృష్ణలతో పాటు వారి భార్యలుగా నటించిన పావని గంగిరెడ్డి, జోర్దార్ సుజాత, దేవియాని శర్మలు తమ యాక్టింగ్‌తో మరోసారి నవ్వించడానికి రెడీ అయ్యారు. మహి వి. రాఘవ్, ప్రదీప్ అద్వైతం క్రియేట్ చేసిన ఈ సిరీస్‌ను శ్రీరామ్ ఎరగం డైరెక్ట్ చేశారు. ట్రైలర్ ప్రామిసింగ్‌గా ఉండటంతో ఈసారి కూడా హాట్‌స్టార్‌లో నవ్వుల పంట పండటం ఖాయంగా కనిపిస్తోంది.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read also:

