Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
షాహీన్ అఫ్రిది పోస్ట్‌పై నెటిజన్ల ఫైర్

షాహీన్ అఫ్రిది పోస్ట్‌పై నెటిజన్ల ఫైర్

వార్త 2 months ago

Shaheen Afridi: అమెరికా-ఇరాన్ మధ్య కుదిరిన కీలక కాల్పుల విరమణ ఒప్పందం ఇప్పుడు పాకిస్థాన్ క్రికెట్‌లో కొత్త వివాదానికి తెరలేపింది. పాక్ స్టార్ పేసర్ షాహీన్ అఫ్రిది చేసిన రాజకీయ వ్యాఖ్యలు, పీసీబీ (PCB) అనుసరిస్తున్న ద్వంద్వ నీతిపై సోషల్ మీడియాలో నెటిజన్లు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు.పాకిస్థాన్ క్రికెట్ బోర్డు నిబంధనల ప్రకారం క్రీడాకారులు రాజకీయ విషయాలపై బహిరంగంగా స్పందించకూడదు.

కానీ, షాహీన్ అఫ్రిది తాజా పోస్ట్ ఈ నిబంధనలను ఉల్లంఘించినట్లు కనిపిస్తోంది.

Read Also: KKR vs LSG Results: ముకుల్ చౌదరి విధ్వంసం.. కోల్‌కతాపై లక్నో విజయం

 Shaheen Afridi political post on US Iran ceasefire

Shaheen Afridi: అఫ్రిది చేసిన వ్యాఖ్యలు

ఈ ఒప్పందంలో మధ్యవర్తిత్వం వహించినందుకు పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఫీల్డ్ మార్షల్ అసీమ్ మునీర్‌లను పొగుడుతూ అఫ్రిది సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు. ప్రపంచ శాంతి కోసం పాకిస్థాన్ నాయకత్వం వహించడం గర్వంగా ఉందంటూ ఆయన చేసిన ఈ వ్యాఖ్యలపై నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. అయితే దీనిపై పీసీబీ ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

ఒక్కసారిగా ట్రేండింగ్ లోకి ముకుల్ చౌదరి

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha