Donald Trump : నా కోడి కుంపటి లేకుంటే తెల్లవారదులే అనుకుంటుండే ది వెనుకటికో ఓ ముసలవ్వ. ఇప్పుడు శ్వేతాధినేత ట్రంప్ కూడా అదే ధోరణిలో మాట్లాడుతున్నాడు.
ఇజ్రాయెల్ మిత్రత్వ కారణంగా ఇరాన్తో పోరుకు తలబడిన ఆయన ఇప్పుడు తలగోక్కుంటున్నాడు. ఇజ్రాయెల్ ప్రధాని నెతనాహ్యును వదిలిపెట్టనూ లేడు, తాజా యుద్ధం మీద ఎలాంటి నిర్ణయం తేల్చనూ లేడు. అలా అని సమర్థించే పరిస్థితీ లేదూ. అయినా ఊబిలో పడ్డ దున్న మాదిరి పెనుగులాడుతున్నాడు. పరిస్థితుల్లో ట్రంప్ మరింత వాచాలత ప్రదర్శిస్తున్నారు. జరిగిందేదో జరిగిపోయిందిలే అని ఊరుకునే మనస్తత్వంలోనూ లేడాయన. ఇరాన్తో సంధి చేసుకుంటే తనకు అవమానమని భావిస్తూ ఎప్పటి కప్పుడు వగచడం తప్ప ఏం చేయలేని పరిస్థితి ఆయనది.. నిర్యుద్ధ ప్రకటన జరిగే చర్చలను ముందుకు సాగకుండా ఉండటంతో ట్రంపు నెతన్యాహు నుంచి ఒత్తిడిలుండట మేనని ఇరాన్ భావన. అందుకే ఇక చర్చల్లేవ్! చర్చించు కోటాల్లేవ్! అనే మాటలు యధాలాపంగా వినపడుతు న్నాయి.
Read Also : Trump Latest Statements : నెతన్యాహుపై ట్రంప్ ఆగ్రహం.. జీ7కి హాజరు
Donald Trump
Donald Trump : మిత్రబేధం’
ఇరాన్ ఎప్పుడూ ఒక మాట మీదనే ఉంది. కానీ ట్రంప్ మాత్రమే జరుగుతున్న భీకర యుద్ధానికి, కాల్పుల విరమణ అమలులో ఉన్నట్లేనని రెండు విరుద్ధ అభిప్రా యాలు వ్యక్తం చేస్తున్నారు. మధ్యలో ఏ విషయమూ తెలనివ్వడం లేదు. ఎవరిది చిత్తచాంచల్యమో, భ్రాంతో ఇప్పుడిప్పుడే తేల్చలేని పరిస్థితి ఉంది. ఒకపక్క తీవ్ర స్థాయిలో శతఘ్నులు పేలుతున్నా ఇంకా కాల్పుల విరమణ అమల్లోనే ఉందంటూ సర్దుబాటు సమర్థింపులు జరుగు తున్నాయి. అణుకార్యక్రమం, హర్మూజ్ జలసంధి వంటి అంశాలపై ఎడతెగని చర్చలు జరుగుతున్నాయని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెబుతున్నారు. మరోపక్క ఇజ్రాయెల్ లెబనాన్పై చేస్తున్న భారీదాడుల విషయంలో ట్రంప్ ప్రతిపాదనలేమీ ఇజ్రాయెల్ అధ్యక్షుడు నెతన్యాహు వినడం లేదు. వారిద్దరి మధ్య కొంత ‘మిత్రబేధం’ ఏర్పడిందా! అని అనిపిస్తోంది. ఇజ్రాయెల్మంకుపట్టు వీడకపోవడంతో అమెరికా ఆగ్రహం చెందింది. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియోతో చర్చించిన అంశాలన్నిటినీ బహిర్గతం చేయడంలో కూడా అమెరికా అత్యుత్సాహం చూపిస్తోంది. అవి కూడా నిర్దిష్టంగా లేవు. రష్యా చమురును కొనుగోలు చేస్తూ వచ్చిన భారత్పై ఆంక్షలు పెట్టిన అమెరికా ఇప్పుడు స్వరం మార్చింది. రష్యా చమురు ప్రపంచ దేశాలకు అందుబాటులోకి వస్తేనే పశ్చిమాసియా చమురు సంక్షోభా నికి కొంతైనా పరిష్కారం చూపినవారమవుతామని ఇటీవల భారత్లో పర్యటించి వెళ్లిన అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మార్కో రుబియో వ్యాఖ్యానిస్తున్నారు. ఇవన్నీ గమనిస్తున్న ఇరాన్ ఎలాంటి పరిస్థితుల్లోనూ అమెరికా, ఇజ్రాయెల్తో చర్చలే ఉండవన్న రీతిలో అమెరికాను వాచ్చరిస్తోంది.
నెతన్యాహు మీద చిర్రెత్తుకొచ్చి
అసలు యుద్ధం జరుగుతోందా, కాల్పుల విరమణ ఉన్నట్లా? లేదా! యుద్ధం మిధ్యేనా ఇలాంటి సంగతులన్నీ ఆయా దేశ ప్రజల ఊహాగానాల్లోని అంశాలు గా ఉండిపోయాయి. లెబనాన్ లోని హిజ్ బొల్లా లక్ష్యాలపై దాడులు కొనసాగిస్తున్న ఇజ్రాయెల్ బీరుట్ మీద కూడా దాడులకు తెగబడటం ఇరాన్ వ్యతిరేకిస్తోంది. ఈ నేపథ్యం లోనే కాల్పుల విరమణ ఒప్పందంపై ఇరాన్ పాకిస్థాన్తో చర్చలు మానేసింది. ఈ అంశాలను ఇరాన్ వార్తా సంస్థలు ధృవీకరించాయి. అమెరికాతో కాల్పుల విరమణ అంశంలో లెబనాన్, ఇజ్రాయెల్ మధ్య జరుగు తున్న పోరుకు ఏ మాత్రం సంబంధం లేదని ఇజ్రాయెల్ వాదిస్తోంది. ఎటువంటి రాజీ అయినా ఇజ్రాయెల్తో సంబంధమున్న అంశాలకూ వర్తిస్తుందని, ఇజ్రాయెల్ దాడులు కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘనేనని ఇరాన్ మండిపడుతోంది. లెబ నాన్ దక్షిణ ప్రాంతంపై ఇజ్రాయెల్జరిపిన దాడులో 8 మంది చనిపోయారు. ఇరాన్, అమెరికాల మధ్య చర్చలతో తమ ప్రమేయమేమీ లేదన్నట్లు వ్యవహరిస్తున్న ఇజ్రాయెల్ తన యుద్ధతంత్రాన్ని ఆపే పరిస్థితిలో లేదు. ఇదే సంద ర్భంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్కి ఇజ్రాయెల్ అధ్యక్షుడు నెతన్యాహు మీద చిర్రెత్తుకొచ్చి మాట్లాడారు. తాను లేకుంటే నెతన్యాహు జైల్లో ఉండేవాడవని అన్యాపదేశంగా ట్రంప్ అనేసారు. ఏదీ తెగదు, నెతన్యాహ్యు తెగనివ్వడు అనే ధోరణిలో మాట్లాడారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమిన్ కలిసి రావడం లేదంటూ ట్రంప్ అభ్యంతరకర భాషలో నేరుగా ఫోన్లోనే విరుచుకుపడ్డారు.
Donald Trump
చర్చల పురోగతి ప్రధాన అడ్డంకి
నిజానికి అమెరికా ఇరాన్ల మధ్య శాంతి ఒప్పందమేమీ కుదరలేదు. వారిద్దరి మధ్య చర్చలంటే ఒకరు వేలికేస్తే మరొకరు కాలికేస్తారు. అలాగే కాలికేసేది ఒకరైతే వేలికేసేది మరొకరు. అంతే తప్ప చర్చలు సజావుగా సాగనివ్వరు. ఒప్పందాన్ని ఓ కొలిక్కి రానీయరు. అన్న చందంగా సాగుతోంది. వీళ్ల చర్చలు స్థిరమైన శాంతి ఒప్పందానికి భరోసా ఇవ్వలేకపోతున్నాయి. మధ్యలో ఇజ్రాయిల్ చీకాకులు కొన్ని. వీటన్నిటితో ట్రంప్ సతమత మవుతున్నట్లు కనపడుతోంది. పరస్పర అవిశ్వాసం, చర్చల పురోగతి ప్రధాన అడ్డంకిగా మారింది. ఒకవైపు దౌత్యం, మరోవైపు సైనిక చర్చలు, ఒప్పందాల ఉల్లంఘనలతో చర్చలకు మార్గం సుగమమయ్యే పరిస్థితి కనపడుట లేదు. పరిస్థితులను సంక్లిష్టం చేస్తోంది. పశ్చి మాసియా యుద్ధ మంటే ప్రపంచ దేశాలన్నిటినీ చమురు సంక్షోభంలో ముంచిన ఓ సైనిక ప్రక్రియలాగే కనపడు తోంది. యుద్ధం ముగిసినా ప్రపంచ జనాభా నెత్తిన ధరల పిడుగు ప్రభా వం నుంచి తప్పించలేరు. బిడ్డ చచ్చినా పురిటికంపు పోదన్న రీతిలో జనం యావత్తూ ఆర్థిక సమ స్యలతో మునిగిపోయారన్నది జగద్విదితం. ఒకవేళ దీర్ఘ కాలిక శాంతి ఒప్పందం కుదిరినా అంతర్జాతీయ చమురు మార్కె ట్లు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ప్రభావం నుంచి ఏ దేశమూ తప్పించుకోలేదు. అమెరికా ఆది నుంచీ చెప్తున్న ట్లు ఈ యుద్ధం ఇరాన్ ‘అణు కార్యక్రమం ఆపాలనే’ అని అయితే ఈ పాటికే ‘శాంతి రేఖలు’ విలసిల్లేవి.
Read hindi news : hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also:

