Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
నెతన్యాహుపై ట్రంప్ ఆగ్రహం.. జీ7కి హాజరు

నెతన్యాహుపై ట్రంప్ ఆగ్రహం.. జీ7కి హాజరు

వార్త 1 week ago

నెతన్యాహుతో తీవ్ర వాగ్వాదం.. లెబనాన్‌పై అసహనం

Trump Latest Statements : పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో తనకు ఫోన్‌లో తీవ్ర వాగ్వాదం జరిగినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Trump) అంగీకరించారు.

లెబనాన్‌పై ఇజ్రాయెల్ జరుపుతున్న దాడుల పట్ల ఆయన అసహనం వ్యక్తం చేశారు. యుద్ధాన్ని వెంటనే ఆపాలని నెతన్యాహుకు స్పష్టంగా చెప్పానని, ఈ సంభాషణలో తాను కఠిన పదజాలాన్ని ఉపయోగించానని ట్రంప్ వెల్లడించారు. న్యూయార్క్ పోస్ట్ పోడ్‌కాస్ట్‌లో మాట్లాడిన ట్రంప్.. ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీని భవిష్యత్తులో కలిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఇరాన్‌లో తుది నిర్ణయాలు తీసుకునే శక్తి ఆయనదేనని, పరిస్థితులు అనుకూలిస్తే ఈ భేటీ జరుగుతుందని చెప్పారు. ఇరాన్‌తో దౌత్యపరమైన చర్చలు సానుకూలంగా సాగుతున్నప్పటికీ, తుది ఒప్పందంపై ఇప్పుడే గ్యారంటీ ఇవ్వలేమన్నారు.

Read Also: Big Shock to Trump : ట్రంప్ కు భారీ ఎదురుదెబ్బ

 Trump Latest Statements

యురేనియం నిల్వలు, హర్ముజ్ జలసంధిపై వ్యూహం

ఇరాన్‌తో ఒప్పందం కుదిరిన వెంటనే వ్యూహాత్మక హర్ముజ్ జలసంధి పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తుందని ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే, ఇరాన్ వద్ద ఉన్న సుసంపన్న యురేనియం నిల్వలను అమెరికా స్వాధీనం చేసుకోవాలని తాను కోరుకుంటున్నట్లు చెప్పారు. ఆ నిల్వలను నిర్వహించే సామర్థ్యం కేవలం అమెరికా, చైనాలకు మాత్రమే ఉందని ఆయన స్పష్టం చేశారు.

Trump Latest Statements : ఇరాన్ విదేశాంగ మంత్రి భిన్న స్వరం

ట్రంప్ వ్యాఖ్యలపై ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ భిన్నంగా స్పందించారు. అమెరికాతో సందేశాల మార్పిడి జరుగుతున్న మాట వాస్తవమే అయినా, చర్చల్లో ఎలాంటి పురోగతి లేదన్నారు. ఇరాన్ ప్రజల హక్కుల రక్షణ, లెబనాన్‌లో యుద్ధ ముగింపు వంటి డిమాండ్లు నెరవేరితేనే అధికారిక చర్చలకు వస్తామన్నారు. బీరూట్‌పై దాడులు కొనసాగితే ఇజ్రాయెల్‌పై ప్రతిదాడులు తప్పవని హెచ్చరించారు. కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంపై జరిగిన క్షిపణి, డ్రోన్ దాడి విషయంలో అమెరికా, ఇరాన్ మధ్య ఆరోపణలు ముదిరాయి. ఈ దాడిలో ఒక భారతీయుడు మరణించగా, 63 మంది గాయపడ్డారు. అమెరికా పేట్రియట్ క్షిపణి వ్యవస్థ లోపం వల్లే ఈ నష్టం జరిగిందని ఇరాన్ అనగా.. ఇరాన్ ఉద్దేశపూర్వకంగానే ఈ దాడి చేసిందని అమెరికా సెంట్రల్ కమాండ్ (సెంట్‌కామ్) కొట్టిపారేసింది. జూన్ 15 నుంచి 17 వరకు ఫ్రాన్స్‌లో జరగనున్న జీ7 సదస్సుకు తాను హాజరవుతున్నట్లు ట్రంప్ ప్రకటించారు. ఈ సదస్సులో పశ్చిమాసియా పరిస్థితులు, ఇరాన్ యుద్ధం ప్రధాన అజెండాగా మారనున్నాయి. గల్ఫ్ ప్రాంతంలో మారుతున్న సమీకరణాల నేపథ్యంలో ఈ అంతర్జాతీయ సమావేశం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

బంగ్లాకు తరలిపోతున్న వలస ఓట్లు!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha