Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
శాంతినగర్‌లో సిలిండర్ పేలుడు. నలుగురికి తీవ్ర గాయాలు!

శాంతినగర్‌లో సిలిండర్ పేలుడు. నలుగురికి తీవ్ర గాయాలు!

వార్త 2 months ago

Sangareddy Cylinder Blast: సంగారెడ్డి పట్టణంలోని శాంతినగర్‌లో జరిగిన గ్యాస్ సిలిండర్ పేలుడు ఘటన తీవ్ర ఆందోళనకు గురిచేసింది. ఈ ప్రమాదంలో సంగమేశ్, మల్లమ్మ, బిందు, చిన్న లకు తీవ్ర గాయాలు అయ్యాయి.

ఘటన చోటుచేసుకున్న వెంటనే స్థానికులు అప్రమత్తమై గాయపడిన వారిని అత్యవసరంగా సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Read Also: Sangareddy: పుల్కల్‌లో అగ్నిప్రమాదం: ఇళ్లు కోల్పోయిన బాధితులకు మాజీ కార్పొరేషన్ చైర్మన్ భిక్షపతి భరోసా

Sangareddy Cylinder Blast: ఘటనా స్థలిలో ఎమ్మెల్యే సమీక్ష

విషయం తెలుసుకున్న సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. పేలుడు కారణాలను స్థానికులను అడిగి తెలుసుకున్నారు..అనంతరం ఆసుపత్రికి వెళ్లి చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించిన ఎమ్మెల్యే , వారి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులతో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. గాయాల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని బాధితులను హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రికి తరలించేలా ప్రత్యేకంగా చర్యలు తీసుకున్నారు.ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది …

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

మహిళను ఆటోలో ఎక్కించి… బంగారం చోరీ

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha