Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
శనగ కొనుగోళ్ల పెంపుపై మంత్రి అచ్చెన్నాయుడు ప్రత్యేక చొరవ

శనగ కొనుగోళ్ల పెంపుపై మంత్రి అచ్చెన్నాయుడు ప్రత్యేక చొరవ

వార్త 2 months ago

AP Bengal Gram Procurement: రాష్ట్రంలో శనగ ఉత్పత్తి భారీగా పెరగడంతో రైతులు ఇబ్బందులు పడకుండా ఉండేం దుకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ప్రత్యేక చొరవ చూపారు.

ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం అనుమతించిన కొనుగోలు పరిమితి సరిపోదని గుర్తించిన మంత్రి, ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి కి తీసుకెళ్ళారు. మంత్రి అచ్చెన్నాయుడు సూచనల మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్కు లేఖ రాశారు.

Read Also: Nara Lokesh meets Nitin Nabin: బీజేపీ నేతతో లోకేశ్ భేటీ

 Minister Atchennaidu on Bengal Gram procurement

AP Bengal Gram Procurement: ప్రస్తుత కొనుగోళ్ల వివరాలు

ఇప్పటికే రాష్ట్రంలో ఏపి మార్క్ ఫెడ్ ద్వారా 72 వేల మెట్రిక్ టన్నులు, నాఫెడ్ ద్వారా 12వేల మెట్రిక్ టన్నుల శనగ కొనుగోలు చేశారు. మొత్తం 84వేల మెట్రిక్ టన్నుల కొనుగోలు పూర్తవడంతో ప్రస్తుతం ఉన్న లక్ష్యం త్వరలోనే పూర్తయ్యే అవకాశం ఉంది. రాష్ట్ర వ్యవసాయ శాఖ తాజా అంచనాల ప్రకారం ఈ ఏడాది శనగ సాగు విస్తీర్ణం 3,88,413 హెక్టార్లకు పెరిగింది. ఉత్పత్తి కూడా 4,57,365 మెట్రిక్ టన్నులకు చేరే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

లక్ష్యం పెంపు కోసం అభ్యర్థన

ప్రస్తుతం రాష్ట్రానికి 94,500 మెట్రిక్ టన్నుల శనగ కొనుగోలు లక్ష్యం మాత్రమే ఉన్నప్పటికీ పెరిగిన ఉత్పత్తి దృష్ట్యా దాన్ని 4,57,365 మెట్రిక్ టన్నులకు పెంచాలని కేంద్రాన్ని కోరారు. ప్రస్తుతం మార్కెట్లో శనగ ధర కనీస మద్దతు ధరకంటే తక్కువగా ఉండడంతో రైతులు తమ మొత్తం ఉత్పత్తిని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు తీసుకువస్తున్నారు. ఈ నేపధ్యంలో రైతులు నష్టపోకుండా ఉండేందకు అదనపు కొనుగోళ్ళు తప్పనిసరి అని మంత్రి అచ్చెన్నా యుడు భావించారు. రైతుల ప్రయోజ నాలను దృష్టిలో పెట్టుకొని, పెరిగిన ఉత్పత్తికి అనుగుణంగా శనగ కొనుగోలు లక్ష్యాన్ని పెంచాలని కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరింది.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

హాస్టల్ విద్యార్థుల పట్ల నిర్లక్ష్యంగా ఉంటే సస్పెన్షనే.. మంత్రి సవిత

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha