Rat bite incident Simhachalam: సింహాచలం ఎంపీజే గురుకుల పాఠశాలలో పది మంది విద్యార్థులకు ఎలుకల కరిచిన ఘటనపై రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు.
తక్షణమే విద్యార్థులకు వైద్య సేవలందించాలని ఆదేశించారు. విద్యార్థులను కన్న బిడ్డల్లా సాకాలని, భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతమైతే సహించేది లేదని హెచ్చరించారు. ఈ మేరకు గురువారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు.
Read Also: Dornala Road Accident: డీసీఎంను ఢీకొట్టిన టూరిస్ట్ బస్సు.. ఒకరు దుర్మరణం
Minister S. Savita is angry over the rat attack incident.
Rat bite incident Simhachalam: వైద్య సేవలు, కారణాలపై ఆరా
సింహాచలం ఎంపీజే గురుకుల పాఠశాలలో పది మంది విద్యార్థులకు ఎలుకల కరిచిన ఘటన గురించి ఆ స్కూళ్ల కార్యదర్శి మాధవీలతతో మాట్లాడారు. విద్యార్థులకు అందుతున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. గాయం తగ్గేవరకూ వైద్య సేవలు అందిస్తూ ఉండాలని స్పష్టంచేశారు. విద్యార్థులు ఉంటున్న గదిలోకి ఎలుకలు ఎలా ప్రవేశించాయని ప్రశ్నించారు. విద్యార్థుల గదుల్లోకి దోమలు, ఎలుకలు, ఇతర ప్రాణాంతక జీవాలు, విషపూరిత కీటకాలు రాకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఎంజేపీ స్కూల్ కార్యదర్శి మాధవీలత మాట్లాడుతూ, హాస్టల్ లో మరమ్మతులు చేయడం వల్ల కిటికీ మెస్ లు తొలగించారని, దానివల్లే ఎలుకలు గదిలోకి ప్రవేశించాయని వివరణ ఇచ్చారు. విద్యార్థులను వేరే గదికి తరలించామన్నారు. ఎలుకలను పట్టుకోడానికి బోనెలు ఏర్పాటు చేశామన్నారు. విద్యార్థులకు ఎప్పటికప్పుడు ఇవ్వాలని ఉన్న సిబ్బందికి మెమోలు ఆదేశించారు. తల్లిదండ్రులు వైద్యసేవలందిస్తున్నామని వివరించారు.
బాధ్యతాయుతంగా ఉండాలని హెచ్చరిక
మంత్రి సవిత మాట్లాడుతూ, ప్రస్తుతం గురుకులంలో ఉన్న ఎలుకలను పారదోలాలన్నారు. నిరక్ష ప్రభుత్వంపై నమ్మకం తో తమ బిడ్డలను హాస్టళ్లు, గురుకులాల్లో చేర్పిస్తు న్నారన్నారు. వారి నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. హాస్టళ్లలో విద్యానభ్యసించే విద్యార్థులను కన్నబిడ్డల మాదిరి చూసుకోవాలన్నారు. బీసీ బిడ్డలపై నిరక్ష చూపితే సహించేది లేదన్నారు. సీఎం చంద్రబాబునాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం బీసీ విద్యార్థులకు ఆహార, ఆరోగ్య భద్రతతో కూడిన విద్య కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేసిందనారు.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also:

