Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
శరవేగంగా సాగుతున్న 'మెగా 158' షూటింగ్

శరవేగంగా సాగుతున్న 'మెగా 158' షూటింగ్

వార్త 1 week ago

Mega 158 movie: మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా, మాస్ ఎంటర్‌టైనర్స్ స్పెషలిస్ట్ బాబీ కొల్లి (కె.ఎస్. రవీంద్ర) దర్శకత్వంలో ప్రతిష్ఠాత్మకంగా రూపొందుతున్న హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామా Mega158 (చిరు-బాబీ 2) షూటింగ్ శరవేగంగా సాగుతోంది.

ఇటీవలే ఘనంగా ప్రారంభమైన ఈ చిత్రం తాజాగా తమిళనాడులోని పొల్లాచ్చి పరిసర ప్రాంతాల్లో సరికొత్త మరియు కీలకమైన షెడ్యూల్‌ను మొదలుపెట్టింది. ఈ సుదీర్ఘ షెడ్యూల్‌లో చిరంజీవితో పాటు సినిమాలోని ఇతర ముఖ్య తారాగణంపై కొన్ని కీలకమైన యాక్షన్ మరియు డ్రామా సీన్లను దర్శకుడు బాబీ చిత్రీకరిస్తున్నారు.

 PollachiSchedule

Read also: Jananayagan clips leaked: విజయ్ మూవీ 'జననాయగన్' క్లిప్స్ లీక్..ఆరుగురు నిందితులు అరెస్ట్

తెలుగు తెరకు పరిచయం కానున్న అనస్వర రాజన్

మలయాళ చిత్ర పరిశ్రమలో తన నటనతో గుర్తింపు తెచ్చుకున్న యువ నటి అనస్వర రాజన్ ఈ చిత్రం ద్వారా టాలీవుడ్‌లోకి అడుగుపెడుతోంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో ఆమె ఒక కీలక పాత్ర పోషిస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా వెల్లడించారు. గతంలో వచ్చిన ‘వాల్తేరు వీరయ్య’ వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత చిరంజీవి – బాబీ కాంబినేషన్‌లో వస్తున్న రెండో సినిమా కావడం, దానికి తోడు చిరంజీవి తన మేకోవర్ కోసం జిమ్‌లో కఠినంగా వర్కవుట్స్ చేస్తున్న వీడియోలు ఇంటర్నెట్‌లో ట్రెండ్ అవ్వడంతో.. ఈ చిత్రంపై మెగా అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

Mega 158 movie: టాప్ క్లాస్ టెక్నికల్ టీమ్.. ‘బ్లడీ బెంచ్‌మార్క్’ టార్గెట్

ప్రముఖ నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ (KVN Productions) బ్యానర్‌పై వెంకట్ కె. నారాయణ అత్యంత భారీ బడ్జెట్‌తో, గ్లోబల్ స్టాండర్డ్స్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌కు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఎస్‌ఎస్ సంగీతాన్ని అందిస్తుండగా, ‘జైలర్’ చిత్రంతో ప్రశంసలు అందుకున్న విజయ్ కార్తీక్ కన్నన్ సినిమాటోగ్రాఫర్‌గా విజువల్స్ అందిస్తున్నారు.

మరికొంత మంది అగ్ర సాంకేతిక నిపుణులు ఈ సినిమాకు పని చేస్తున్నారు.ఎడిటింగ్: ఆంటోనీ రూబెన్, ప్రొడక్షన్ డిజైన్ (ఆర్ట్): కొల్లా అవినాష్ వ్యవహరిస్తున్నారు.”The blade that set the bloody benchmark” అనే పవర్‌ఫుల్ ట్యాగ్‌లైన్‌తో విడుదలైన కాన్సెప్ట్ పోస్టర్ ఇప్పటికే అంచనాలను ఆకాశానికి తీసుకెళ్లగా, పొల్లాచ్చి షెడ్యూల్‌తో సినిమా అవుట్‌పుట్‌పై యూనిట్ పూర్తి ధీమాతో ఉంది.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read also:

'పెద్ది' ఫస్ట్ డే బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha