Bhogi Movie First Single: చార్మింగ్ స్టార్ శర్వానంద్ హీరోగా, మాస్ డైరెక్టర్ సంపత్ నంది దర్శకత్వంలో వస్తున్న పీరియాడిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'భోగి'.
ఇప్పటికే విడుదలైన టీజర్‌తో భారీ అంచనాలను నెలకొల్పిన ఈ చిత్రం నుంచి చిత్ర బృందం మ్యూజికల్ ప్రమోషన్లను అధికారికంగా ప్రారంభించింది. ఇందులో భాగంగా 'ఎగిలివారంగ' అనే తొలి పాటను అక్టోబరు 9న విడుదల చేసింది. ఈ జానపద గీతం సంగీత ప్రియులను విశేషంగా ఆకట్టుకుంటోంది.
Prabhas Fauji Movie: 'ఫౌజీ' సినిమా విడుదల తేదీలో మార్పు?
'Egilivaranga' song released from Sharwanand's 'Bhogi'
Bhogi Movie First Single: భీమ్స్ మాస్ స్వరాలు & చంద్రబోస్ సాహిత్యం
ఈ పాటకు భీమ్స్ సిసిరోలియో స్వరాలు సమకూర్చగా, ప్రముఖ గేయ రచయిత చంద్రబోస్ అద్భుతమైన సాహిత్యాన్ని అందించారు. నల్గొండ గద్దర్ నరసన్న, కందుకూరి శంకర్ బాబు, రేలారే గోపాల్ తమ పవర్ ఫుల్ గాత్రంతో ఈ పాటకు ప్రాణం పోశారు. ఈ పాటను తన సోషల్ మీడియా వేదికగా పంచుకున్న దర్శకుడు సంపత్ నంది.. ఇది కేవలం పాట మాత్రమే కాదని, ప్రతి పల్లె ఆత్మను పలకరించే ఓ మధురమైన జ్ఞాపకమని అభివర్ణించారు.
1960ల బ్యాక్‌డ్రాప్‌లో పీరియడ్ డ్రామా
1960ల నాటి గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ ఇంటెన్స్ పీరియడ్ యాక్షన్ డ్రామా టీజర్ ఇప్పటికే 15 మిలియన్లకు పైగా వ్యూస్‌తో యూట్యూబ్‌లో సంచలనం సృష్టించింది. శ్రీసత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కె.కె. రాధామోహన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో శర్వానంద్ సరసన అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయాతి హీరోయిన్లుగా నటిస్తున్నారు.
నవంబర్ 12న గ్రాండ్ రిలీజ్
అన్ని కార్యక్రమాలు వేగంగా పూర్తి చేసి, ఈ చిత్రాన్ని నవంబర్ 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. సినిమా విడుదలకు నెల రోజుల సమయం మాత్రమే ఉండటంతో ఈ పాట ప్రమోషన్లకు మరింత ఊపునిస్తుందని మేకర్స్ భావిస్తున్నారు.

