Dailyhunt
శత్రువులకు సహకరిస్తే వదిలేది లేదు: గల్ఫ్ దేశాలకు ఇరాన్ అధ్యక్షుడు హెచ్చరిక

శత్రువులకు సహకరిస్తే వదిలేది లేదు: గల్ఫ్ దేశాలకు ఇరాన్ అధ్యక్షుడు హెచ్చరిక

వార్త 3 weeks ago

Iran President: పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు మరింత భయంకరంగా మారుతున్న వేళ, ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ పొరుగున ఉన్న గల్ఫ్ దేశాలకు అల్టిమేటం జారీ చేశారు.

తమ భూభాగాల నుంచి అమెరికా, ఇజ్రాయెల్ దాడులు చేయకుండా నిరోధించాలని, లేనిపక్షంలో ఆయా దేశాలు కూడా తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు.

Read Also:Russian Gasoline: ఏప్రిల్ 1 నుండి రష్యా గ్యాసోలిన్ ఎగుమతులపై నిషేధం: గ్లోబల్ మార్కెట్‌లో కలకలం

Iran President warns Gulf nations

Iran President: గగనతల వినియోగంపై ఆంక్షలు

గల్ఫ్ దేశాల్లోని సైనిక స్థావరాల నుంచి అమెరికా ఇరాన్‌పై దాడులు చేస్తోందని పెజెష్కియాన్ ఆరోపించారు. “మీకు అభివృద్ధి, భద్రత, శాంతి కావాలనుకుంటే.. శత్రువులకు మీ గగనతలాన్ని (Airspace) వాడటానికి అనుమతి ఇవ్వకండి. మాపై దాడులు చేయడానికి మీ భూభాగాలను వేదికగా మార్చవద్దు” అని ఆయన స్పష్టం చేశారు.

లక్ష్యంగా ఉన్న దేశాలు

బహ్రెయిన్, కువైట్, ఖతార్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE), జోర్డాన్ వంటి దేశాలకు ఇరాన్ ఈ హెచ్చరికలు పంపింది. శత్రువులకు సహకరించే ఏ దేశాన్నైనా తాము వదిలిపెట్టబోమని, వారిని కూడా శత్రువులుగానే పరిగణిస్తామని ఇరాన్ తేల్చిచెప్పింది.ఇరాన్ ఎప్పుడూ ముందుగా దాడులు చేయదని స్పష్టంగా చెప్పామని అన్నారు. కానీ తమ మౌలిక సదుపాయాలు, ఆర్థిక కేంద్రాలు, అణుకేంద్రాలను లక్ష్యంగా చేసుకుంటే ప్రతీకారం తప్పదని పలుమార్లు హెచ్చరించామని గుర్తు చేశారు. శత్రుస్థావరాలు భూస్థాపితమయ్యే వరకు దాడులు చేస్తామని స్పష్టం చేశారు. శత్రువులకు సహకరించిన వారిని కూడా వదిలేది లేదన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

ఇరాన్ ఇజ్రాయెల్‌పై భారీ క్షిపణి దాడులు..'ఇన్‌స్టిట్యూట్ ఫర్ ది స్టడీ ఆఫ్ వార్' నివేదిక

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha