Iran nuclear chief : తమపై ఆంక్షలు విధించిన శత్రువులు ఎట్టి పరిస్థితుల్లోనూ విజయం సాధించలేరని ఇరాన్ అణు ఇంధన సంస్థ అధిపతి మొహమ్మద్ ఎస్లామీ స్పష్టం చేశారు.
అణు ఇంధనాన్ని అభివృద్ధి చేసుకోవడం తమ దేశ హక్కు అని ఆయన తెలిపారు. ఇరాన్ హక్కులను పరిరక్షించడం అత్యంత ముఖ్యమని పేర్కొన్నారు.
యురేనియం శుద్ధిపై అమెరికాతో విభేదాలు
కాల్పుల విరమణ చర్చల్లో ముఖ్య అంశంగా నిలిచిన యురేనియం శుద్ధి కార్యక్రమాన్ని అమెరికా వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎస్లామీ మాట్లాడుతూ, ఇరాన్ తన అణు హక్కులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోదని స్పష్టం చేశారు. ఎటువంటి చర్చలైనా దేశ హక్కులను కాపాడే విధంగానే ఉండాలని ఆయన పేర్కొన్నారు.
Read Also:Ibrahimpatnam: చైర్మన్ సుదర్శన్‌రెడ్డికి ఘన సన్మానం
Iran nuclear chiefకాల్పుల విరమణ తర్వాత మళ్లీ ఉద్రిక్తత
ఇటీవల అమెరికా, ఇరాన్ మధ్య కాల్పుల విరమణకు అంగీకారం కుదిరింది. అయితే లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు జరగడంతో ప్రాంతంలో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ పరిణామాల మధ్య ఇరాన్ అణు కార్యక్రమం అంశం మరోసారి అంతర్జాతీయ రాజకీయాల్లో కీలక చర్చగా మారింది.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also:
డీపీవోల సమస్యలు పరిష్కరించండి: కలెక్టర్ ప్రవీణ్యకు వినతి పత్రం అందజేసిన అసోసియేషన్

