Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Shivraj Singh: తెలుగు రాష్ట్రాల రైతులపై అప్పుల భారం ఎక్కువ

Shivraj Singh: తెలుగు రాష్ట్రాల రైతులపై అప్పుల భారం ఎక్కువ

వార్త 4 months ago

దేశంలో రైతుల అప్పుల పరిస్థితిపై లోక్‌సభలో చర్చ జరిగింది.ఈ నేపథ్యంలోనే దేశంలో రాష్ట్రాల వారిగా రైతులపై ఉన్న అప్పులకు సంబంధించి.. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్..

మంగళవారం లోక్‌సభ వేదికగా కీలక ప్రకటన చేశారు. రైతులు అత్యధిక అప్పులు తీసుకున్న రాష్ట్రాల జాబితాను కేంద్రమంత్రి వెల్లడించారు. జులై 2018-జూన్ 2019 మధ్య APలోని ఒక్కో రైతు కుటుంబంపై సగటున రూ.2,35,554 అప్పు ఉందన్నారు. తెలంగాణ రైతుల సగటు అప్పు రూ.1,52,113గా ఉందని తెలిపారు. దేశవ్యాప్తంగా ఉన్న రైతుల సగటు అప్పు రూ.74,121గా ఉందన్నారు.

AP: ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల

ఆర్థిక సంస్కరణలు

ఇందులో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉండగా.. తెలంగాణ ఐదో స్థానంలో ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ లెక్కన దేశంలోనే అధిక అప్పుల భారం ఆంధ్రప్రదేశ్ అన్నదాతలపైనే ఉన్నట్లు స్పష్టం చేశారు. దేశఆర్థిక వ్యవస్థకు మూలం గ్రామీణ, వ్యవసాయ రంగాలే. 1991 తర్వాత చేపడుతున్న ఆర్థిక సంస్కరణలు ఇండియాను ప్రపంచంలోనే ఐదో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా మలిచినా, వ్యవసాయ రంగం సంక్షోభంలో కూరుకుపోతుండటంతో దేశంలో ఉపాధి అవకాశాలు మెరుగు పడటం లేదు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha