Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
శ్రమ జీవులకు నిరంతర స్ఫూర్తి మేడే

శ్రమ జీవులకు నిరంతర స్ఫూర్తి మేడే

వార్త 1 month ago

Labour day: దేశానికి కర్షకుడి అవసరం ఎంత ఉందో కార్మికుడి అవసరం కూడా అంతే ఉంది. అభివృద్ధిలో కార్మిక రంగానిది కీలక పాత్ర. శ్రీ శ్రీ అన్నట్లు శ్రమకు మించిన ఆయుధం లేదు.

శ్రమ శక్తి లేనిదే ఏ దేశ అభి వృద్ధి జరగదు. అందుకే శ్రమను గౌరవించాలి, గుర్తించాలి. శ్రమ దోపి డికి వ్యతిరేకంగా ఎందరో మహాను భావులు జరిపిన పోరాట ఫలితంగా కార్మిక లోకంలో చైతన్యం వెల్లివిరిసిం ది. ఆనాటి దోపిడి విధానాలను సమూలంగా మార్చుకుని కార్మికులు తమ హక్కులను సాధించుకున్న రోజు మేడే. కార్మిక శక్తి లేనిదే సమాజం ముందుకు వెళ్ళదు. కార్మికుడు తన చెమట చుక్కలను, రక్త మాంసాలను కరిగించి పని చేస్తేనే ఈ ప్రపంచం ముందుకు సాగుతుంది. వారి శ్రమకు తగిన గుర్తింపు ఇస్తూ జరుపుకునే పండుగే కార్మిక దినో త్సవం. మే డే కార్మికుల ఐక్యత, పోరాటాలకు నిదర్శ నంగా నిలుస్తుంది. నేడు 140వ మేడే పండుగను జరుపు కోవడంతో పాటు చంద్రన్న సారధ్యంలోని కూటమి ప్రభు త్వం అందిస్తున్న సంక్షేమ పథకాలతో రాష్ట్ర శ్రామికుల్లో ఆనందం వెల్లివిరుస్తున్నది.

Read Also : International Labour Day 2026: నేడు అంతర్జాతీయ కార్మిక దినోత్సవం.. ప్రాముఖ్యత గురించి తెలుసా!

 Labour day

Labour day: ఒక చారిత్రాత్మక చైతన్య దినం

19వ శతాబ్దంలో పరిశ్రమల్లో పని చేసేందుకు అసంఖ్యాకంగా కార్మికుల అవసరం ఏర్ప డింది. పెట్టుబడి దారులు శ్రామికులతో బానిసల్లాగా పని చేయించి అధిక లాభాలు పొందుతుండేవారు. కనీస వస తులైన తిండి, బట్ట, నివాసం వంటివి కల్పించకుండా కనీసం రోజుకు 16 నుంచి 20 గంటలు పని చేయించే వారు. పని స్థలాల్లో సరైన గాలి,వెలుతురు ఉండేవి కావు. దాంతో కొందరు కార్మికులు ప్రమాదాలకు గురై ప్రాణాలు కోల్పోయేవారు. ఈ పరిస్థితికి భిన్నంగా, శ్రమదోపిడీ నుంచి బయటపడేందుకు కార్మికులు తమ హక్కుల కోసం రక్తం చిందించి పోరాడి సాధించుకున్న రోజే మేడే. కార్మికుల శ్రమకు తగిన గుర్తింపు ఇస్తూ ఎనిమిది గంటల పని దినం అమల్లోకి రావడంతో జరుపుకునే పండుగే కార్మిక దినోత్స వం. మే డే ఒక చారిత్రాత్మక చైతన్య దినం. చికాగోలో ఉన్న కొంత మంది ప్రాణత్యాగం చేసి ప్రపంచంలోని కార్మిక వర్గాలకు కొత్త వెలుగును ప్రసాదించిన రోజు. ప్రజల శ్రమను రోజుల తరబడి దోచుకున్న సమయంలో మేమూ మనుషులమే. మా శక్తికి కూడా పరిమితులుంటాయి. ఈచాకిరీ మేం చేయలేమని పనిముట్లు కింద పడేసి ఎనిమిది గంటల పని దినం కోసం పోరాడి చివరకు ప్రాణాలను సైతం తృణప్రాయంగా త్యజించడం కార్మిక వర్గపోరాట పటిమకు నిదర్శనం. 24 గంటలలో ఎనిమిది గంటలు పని, ఎనిమిది గంటలు విశ్రాంతి, ఎనిమిది గంటలు రిక్రి యేషన్ అన్న పద్ధతిని కార్మికులు పోరాటం ద్వారా సాధిం చుకున్నారు.

కార్మిక శక్తి లేనిదే సమాజం ముందుకెళ్ళదూ..

చికాగో పోరాటం కంటే ముందే భారత దేశం లో కలకత్తాలో కార్మికులు నిర్ణీత పని గంటల కోసం హౌరా రైల్వే స్టేషన్లో 1862లో సమ్మెచేశారు. అప్పటివరకు రైల్వే కార్మికులు 10 గంటలు పని చేసేవారు. అయితే ఆ పోరా టం విస్తృత స్థాయిలో ప్రజా పోరుగా మారకపోవడంతో ఉద్యమ స్వరూపాన్ని అందుకోలేదు. 1920లో ట్రేడ్ యూని యన్ ఏర్పడటం మూలంగా అప్పటి నుంచే కార్మికవర్గంలో చైతన్యం పెరగడం మొదలైంది. 1923లో మొదటిసారిగా భారత దేశంలో మేడేను పాటించారు. అప్పటి నుంచి ప్రతి యేడు కార్మికులు ఐక్యంగా మే డేను పాటిస్తున్నారు. కార్మిక శక్తి లేనిదే సమాజం ముందుకెళ్ళదని నమ్మే ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలోని శ్రామికుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు. కార్మికుల సంక్షేమంపై చంద్రన్న ముద్ర స్పష్టంగా కనిపిస్తున్నది.చంద్రబాబుకు ఉన్న అపార అనుభవం, ముందు చూపు వల్ల తమకు మంచిరోజులు వచ్చాయని కార్మికలోకం సంబరపడుతున్నది. అసంఘటిత రంగంలోని భవన నిర్మాణ, ఇతర కార్మికులకు గతంలో అందించిన సంక్షేమ పథకాలను పునరుద్ధరించిన ఘనత చంద్రన్నకే దక్కుతుంది. ప్రసూతికి రూ.20 వేలు, వివా హానికి రూ.40వేలు, సహజ మరణానికి రూ.60 వేలు, అంత్యక్రియలకు రూ.20వేల చొప్పున ఆర్థిక సాయం అంది స్తున్నారు.

 Labour day

కష్టజీవుల ప్రభుత్వం

అసంఘటిత రంగంలో ఉన్న కార్మికుల్లో ఆధు నిక నైపుణ్యాలు, జీవన ప్రమాణాలను పెంచే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తున్నది. నిర్మాణ రంగంలో ఉన్న ప్రముఖ కంపెనీలతోసహా వివిధ సంస్థల సహకారంతోవారికి అవసరమైన నైపుణ్య శిక్షణ ఇస్తున్నారు. ఆధునిక నైపుణ్య శిక్షణ ద్వారా రాష్ట్రంలోని కార్మికులు దేశ, విదేశాల్లో ఉపాధి అవకాశాలు పొంది, అధికఆదాయం ఆర్జించేలా అవకాశాలు మెరుగు పడతాయని చెప్పవచ్చు. ఇది కూటమి ప్రభుత్వం ఘనతే. నైపుణ్యం పోర్టల్ ద్వారా ఈ డేటాబేసను అనుసంధానించడంతోపాటు కార్మికులు లేటరల్ ఎంట్రీద్వారా వివిధ కోర్సులు అభ్యసించి ఉన్నత విద్యార్హతను సాధించేలా ప్రణా ళిక రూపకల్పన జరుగుతున్నది. ఆధునిక పనిముట్లను కార్మికులకు అందించి నైపుణ్యాలు పెంచి అధిక ఆదాయాన్ని ఆర్జిం చే అవకాశం కల్పనదిశగా కసరత్తు సాగుతున్నది. రాష్ట్రం లోని 20లక్షల మంది కార్మికులకు నైపుణ్యాలు పెంచేందుకు అనువుగా కార్యాచరణను కూటమి ప్రభుత్వంచేస్తున్నది. తరచు కార్మికులకు వైద్య పరీక్షలు నిర్వహస్తూ తీవ్ర అనారోగ్య సమస్యలున్న వారిని గుర్తించి, యూని వర్సల్ హెల్త్ పాలసీ తోపాటు కార్మిక శాఖ ద్వారా రూ.2.5 లక్షల వరకు ఉచిత వైద్య చికిత్సలు అందిస్తున్నారు. కార్మిక, కర్షకులు అధునా తన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటూ ముందు కు వెళ్లడం ప్రస్తుతం అత్యంత అవసరం. కార్మికవర్గం పక్షాన నిలబడి వారికి మేలు చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోంది.నాలా చట్టంరద్దు, ఉచిత ఇసుక విధానం, భవన నిర్మాణాలకు, లేఅవుట్లకు అనుమతులు సరళతరంచేయడం వంటి నిర్ణయాలతో ఇప్పటికే నిర్మాణ రంగాన్నినిల బెట్టి లక్షల మంది జీవితాలకు భద్రత కల్పించిన ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కుతుంది. 175 నియోజకవర్గాల్లో ఎంఎస్ ఎంఈ పార్కులు, అన్ని పాంతాల్లో పరిశ్రమల ఏర్పాటుతో పెద్దఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు సృష్టిస్తూ కూటమి ప్రభుత్వం కార్మికుల ప్రభుత్వంగా, కష్టజీవుల ప్రభుత్వంగా మారింది.140వ మేడే సందర్భంగా శ్రామికుల జీవితాల్లో మరిన్ని చంద్రోదయ క్రాంతులు ప్రసరించాలని ఆశిద్దాం.

-వాసం శెట్టి సుభాష్

Read hindi news : hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

ప్రగతి రథానికి శ్రామికుడే సారథి!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha