Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
శ్రీకాకుళం బీచ్‌లో విషాదం.. సముద్రంలో కొట్టుకుపోయి నలుగురు మృతి

శ్రీకాకుళం బీచ్‌లో విషాదం.. సముద్రంలో కొట్టుకుపోయి నలుగురు మృతి

వార్త 2 days ago

Srikakulam Beach Accident: ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం రూరల్ మండలం పీజీపేట సముద్ర తీరంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. దసరా సెలవులను పురస్కరించుకుని సరదాగా విహారయాత్రకు వెళ్లిన యువతలో తీవ్ర విషాదం నెలకొంది.

శ్రీకాకుళం కొత్తరోడ్‌ జంక్షన్ సమీపంలో ఉన్న ‘నెక్స్ట్ ఎరా ప్రైవేట్ లిమిటెడ్’ అనే సంస్థ సోషల్ మీడియా, ఆన్‌లైన్ ఉత్పత్తుల విక్రయాలపై సుమారు 125 మంది యువతీ యువకులకు గత వారం రోజులుగా శిక్షణ ఇస్తోంది. దసరా పండుగను పురస్కరించుకుని సంస్థ మంగళవారం సెలవు ప్రకటించింది. దీంతో విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాలకు చెందిన 25 మంది ట్రైనీలు సరదాగా సమయం గడిపేందుకు శ్రీకాకుళం రూరల్ మండలం పరిధిలోని పెదగనగళ్లవానిపేట బీచ్‌కు వెళ్లారు.

Read Also : Tiger Shroff firing case : టైగర్ ష్రాఫ్ కాల్పుల కేసులో కీలక మలుపు.. మరో నలుగురు అరెస్ట్‌

 Tragedy at Srikakulam beach: Four people swept away by the sea and die

Srikakulam Beach Accident: సెల్ఫీ సరదా తెచ్చిన ముప్పు

పెదగనగళ్లవానిపేట బీచ్‌లోని నాగావళి నది, సముద్రం కలిసే ‘మగ’ అనే సంగమ ప్రాంతానికి వీరంతా చేరుకున్నారు. అక్కడ సముద్రపు అలల మధ్య నిలబడి సెల్ఫీలు తీసుకుంటుండగా, ఒక్కసారిగా వచ్చిన పెద్ద అలల ఉధృతికి విజయనగరం జిల్లా రామభద్రాపురం ప్రాంతానికి చెందిన మర్రి మహేశ్వరి (18), గొల్లపల్లి పావని (19) నీటిలో కొట్టుకుపోయి ప్రాణాలు కోల్పోయారు.

అదే సమయంలో కొండ్ల మాధవి (19) అనే మరో యువతి కూడా అలల తాకిడికి కొట్టుకుపోతుండగా, ఆమెను కాపాడేందుకు పార్వతీపురం మన్యం జిల్లా వీరఘట్టంకు చెందిన బిడ్డిక విక్రమ్ (25) సముద్రంలోకి దిగాడు. అయితే అలల ఉధృతి ఎక్కువగా ఉండటంతో వారిద్దరూ కూడా నీటిలో మునిగి గల్లంతయ్యారు.

కేసు నమోదు చేసిన పోలీసులు

గల్లంతైన కొండ్ల మాధవి, బిడ్డిక విక్రమ్‌ల కోసం గాలింపు చర్యలు చేపట్టగా, బుధవారం నాటికి వారి మృతదేహాలు సముద్ర తీరానికి కొట్టుకొచ్చాయి. ఈ ఘటనపై శ్రీకాకుళం రూరల్ ఎస్ఐ సురేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. పండుగ పూట నలుగురు యువతీయువకులు సముద్రంలో మునిగి ప్రాణాలు కోల్పోవడంతో వారి కుటుంబాల్లో తీవ్ర శోకఛాయలు అలముకున్నాయి.

చెన్నైలో యువ ఇన్‌ఫ్లుయెన్సర్‌ అనుమానాస్పద మృతి

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha