Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పలమనేరులో అంతరాష్ట్ర కిడ్నాప్ ముఠా అరెస్ట్

పలమనేరులో అంతరాష్ట్ర కిడ్నాప్ ముఠా అరెస్ట్

వార్త 1 week ago

Palamaner Crime: కోట్ల రూపాయల డిమాండ్ లో ఆరితేరిన అంతరాష్ట్ర కిడ్నాప్ ముఠాను చిత్తూరు జిల్లా పలమనేరు పోలీసులు ఛేదించారు. జిల్లా ఎస్పీ తుషారూడీ ఆదేశాల మేరకు వలమనేరు సిఐ మోహన్రెడ్డి తన సిబ్బందితో దాడిచేసి 11 మందిని అరెస్టు చేయగా మరో 11 మంది పరారీ అయ్యారు.

బుధవారం డిఎస్పీ డేగల ప్రభాకర్ విలేకర్లకు తెలిపిన వివరాలు. గంగవరం మండలం గంగవరంకు చెందిన ఎంసి రవి (47)ను కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు ఈ నెల 7న పలమనేరు గుడియాత్తం రోడ్డులోని టి. వద్దూరు క్రాస్ వద్ద కిడ్నాప్ చేశారు. కడప జిల్లా పులివెందులకు తీసుకు వెళ్ళి రవి కుటుంబ సభ్యులకు ఫోన్ చేశారు. రూ.2 కోట్లు అందజేయాలని లేదంటే చంపుతామని బెదిరించారు. దీంతో రవి కుటుంబ సభ్యులు ఈ నెల 8న ఉదయం చిక ్బళ్ళాపూర్ హైవే వద్ద రూ.1 కోటి అందజేశారు. కిడ్నాపర్లు ఈ మొత్తం తీసుకొని బాధితుని వద్ద ఉన్న 900 గ్రాముల బంగారు ఆభరణాలు బలవంతంగా లాక్కొని బాధితుని అక్కడే వదిలి పరారీ అయ్యారు. బాధితుని ఫిర్యాదు మేరకు పలమనేరు సిఐ మోహన్రెడ్డి కేసు దర్యాప్తు ప్రారంభించారు. ఇందులో భాగంగా కేరళకి చెందిన రోషన్ గ్యాంగ్ సభ్యులు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలకు చెందిన కొందరు వ్యక్తులు కలసి కుట్రపన్ని ఈ నేరం చేసినట్లు దర్యాప్తులో తేలింది. భానుప్రకాశ్ అనే వ్యక్తి బాధితుడు రవి కదలికలను ఎప్పటికప్పుడు నాగేశ్వరరెడ్డి అనే వ్యక్తి ద్వారా కిడ్నాప్ గ్యాంగ్కు తెలియజేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

Read also: AP EAPCET 2026 Results: AP EAPCET 2026 ఫలితాలపై జేఎన్‌టీయూకే కీలక ప్రకటన

 Inter-state kidnapping gang arrested in Palamaner

Palamaner Crime: కిడ్నాప్ కథాకంపనం ఇలా జరిగింది

ఈ నేపథ్యంలో రవిని కిడ్నాప్ చేయడానికి అవసరమైన వాహనాలు సమకూర్చుకొని గంగవరంలో ఓ లాడ్జిలో బసచేశారు. ఈ నెల 7న బాధితుని కదలికలు గమనించి టి. వడ్లూరు క్రాస్ వద్ద కిడ్నాప్ చేసి పులివెందులకు తరలించారు. దాంతో పోలీసులు సాంకేతిక ఆధారాలు సిసిటివి పుటేజీలు మొబైల్ కాల్దటా వాహనాల కదలికలు ఇతర శాస్త్రీయ ఆధారాలతోఈ కేసులో వున్న కేరళకు చెందిన 7 మందిని ఆంధ్ర ప్రదేశ్కు చెందిన నలుగురిని అరెస్టు చేశారు. కిడ్నాప్కు ఉపయోగించిన వాహనాన్ని గంగవరం మండలం గండ్రాజుపల్లె చెక్పోస్టు వద్ద సీజ్ చేశారు. నిందితులను అరెస్టు చేసి పలమనేరు కోర్టులో హాజరు పరచి రిమాండుకు తరలించారు. నిందితుల నుండి రూ.22 లక్షలు నగదు, మూడు కార్లు మారుతీ స్విప్ట్ డిజైర్, జియా సోనెట్, ఇన్నోవా కారును స్వాధీనం చేసుకున్నారు. రోషన్ వర్గానికి చెందిన గ్యాంగ్డర్ రోషన్ నర్గీస్ పరారీలో వున్నాడు. ఇక అరెస్టు అయిన వారిలో అప్పు అరుణ్, ఎడ్విన్థా మస్, దీపు మోస్, నితిన్ జానీ, కెస్ అభయ్, రతీష్, లిబిన్ ఉన్నారు. అలాగే ఏపి, తెలంగాణాకు చెందిన వారిలో కడపజిల్లా సింహాద్రిపురం ఉప్పలూరుకు చెందిన నాగేశ్వరరెడ్డి, వనపర్తి జిల్లాకు చెందిన మహేష్ నాయుడు, ప్రొద్దుటూరుకు చెందిన పందేళ్ళపల్లెకు చెందిన రామిరెడ్డి, పొద్దుటూరుకు చెందిన గుండ్రా మహేష్రెడ్డి అరెస్టు అయిన వారిలో ఉన్నారు. ఇక పరారీలో వున్న వారు సచూ, అనూప్, నికిల్ మోహన్, స్వాజీ (జిత్తు), అరుణ్, సామి, అమీన్, జస్వంత్ (వరప్రసాద్), అనిల్, మరో వ్యక్తి ప్రణీత్ రెడ్డి స్నేహితుడు కృష్ణారెడ్డి పరారీలో వున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు రోషన్పై కేరళలోని వివిధ పోలీస్ స్టేషన్లలో హత్యాయత్నం, దాడులు, బెదిరింపులు, పేలుడు పదార్థాలు కలిగి వుండడం మొత్తం 15 క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఈ కేసును ఛేదించిన సిఐ మోహన్రెడ్డి, సిబ్బందిని జిల్లా ఎస్పీ, డిఎస్పీ అభినందించారు.

Epaper: epaper.vaartha.com

పెళ్లయిన నెల రోజులకే నవవధువు అనుమానాస్పద మృతి

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha