Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
శ్రీకాళహస్తిలో రూ.500 రాహుకేతుదోష నివారణ పూజలు రద్దు!

శ్రీకాళహస్తిలో రూ.500 రాహుకేతుదోష నివారణ పూజలు రద్దు!

వార్త 2 months ago

Srikalahasti: రూ.5వేల పూజలు ఇక రూ.6 వేలు శ్రీకాళహస్తీశ్వరాలయంలో నిర్వహించే రాహుకేతుదోష నివారణ పూజలకు సంబందించి కీలక నిర్ణయం తీసుకున్నట్లు శాసనసభ్యుడు బొజ్జల సుధీర్రెడ్డి తెలిపారు.

బోర్డు సమావేశం తరువాత ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సమావేశంలో 22 అంశాలకు సంబంధించి చర్చించామని అలాగే కొత్తగా బాధ్యతలుచేపట్టిన ఇఓ బికె వెంకటేశులు వివిధ అంశాలకు సంబంధించి అధ్యయనం చేసిన తరువాత పలు సూచనలు సమావేశంలో వెల్లడించారని అంశాలు వాటిపై చర్చించినట్లు తెలిపారు. ధర్మకర్తల మండలి సమావేశంలో అంశాలకు సంబంధించి కూలంకషంగా చర్చించామన్నారు.

Read also: Akshaya Tritiya 2026: అక్షయ తృతీయ రోజున ఏ వస్తువులు కొనాలి?

Ancient Srikalahasti temple tower

Srikalahasti: పెరిగిన పూజా టికెట్ల ధరల వివరాలు

ఇందులో 14 కీలకంగా ఉన్నాయని ఎంఎస్ఏ వివరించారు. బోర్డు చైర్మెన్ కొట్టెసాయి ప్రసాద్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో నిర్ణయాలను ఎంఎల్ఎ మీడియాకు వివరించారు ఇక శ్రీకాళహస్తీశ్వరాలయంలో నిర్వహిస్తున్న రాహుకేతుదోష నివారణ పూజలకు దేవస్థానం అందించే వెండి నాగపడగలకు సంబంధించి వెండి ధరలు విపరీతంగా పెరిగినందువల్ల నిర్వహణ దృష్ట్యా రూ.500ల రాహుకేతుదోష నివారణ పూజలను రద్దు చేసినట్లు ప్రకటించారు. అయితే రూ.750,1500,2500 పూజలు యథాతధంగా నిర్వహించబడుతాయని వివరించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

తిరుమలలో 3 రోజుల పాటు ఆర్జిత సేవలు రద్దు..

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha