Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
శ్రీనగర్ ఎయిర్పోర్టులో తప్పిన పెను ప్రమాదం

శ్రీనగర్ ఎయిర్పోర్టులో తప్పిన పెను ప్రమాదం

వార్త 2 weeks ago

J&K : జమ్మూ కాశ్మీర్‌లోని శ్రీనగర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఒక విమానానికి పెను ప్రమాదం తృప్తిలో తప్పడంతో ప్రయాణికులు, విమానాశ్రయ అధికారులు తీవ్ర ఊపిరిపీల్చుకున్నారు.

నవీ ముంబై నుండి బయలుదేరి శ్రీనగర్ చేరుకున్న ప్రయాణికుల విమానం రన్‌వేపై సురక్షితంగా ల్యాండ్ అయింది. ఆ తర్వాత విమానాన్ని ట్యాక్సీవే ద్వారా పార్కింగ్ ఏరియాకు (Bay) తరలిస్తున్న క్రమంలో అనుకోకుండా అదుపు తప్పింది. ఈ క్రమంలో అక్కడే ఉన్న విజువల్ డాకింగ్ గైడెన్స్ సిస్టమ్ (VDGS) స్తంభాన్ని విమానం బలంగా ఢీకొట్టింది.

REad Also : పట్టిసీమ నీటితో డెల్టాకు కొత్త ఊపిరి

సురక్షితంగా బయటపడ్డ ప్రయాణికులు: విచారణకు ఆదేశం

ఈ ఘటన జరిగిన వెంటనే అప్రమత్తమైన ఎయిర్‌పోర్ట్ గ్రౌండ్ సిబ్బంది మరియు అత్యవసర రక్షణ బృందాలు వెంటనే సహాయక చర్యలు చేపట్టాయి. విమానంలో ఉన్న ప్రయాణికులను మరియు సిబ్బందిని (Crew members) ఎటువంటి గాయాలు కాకుండా అత్యంత సురక్షితంగా కిందకు దించారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి హాని జరగకపోవడంతో అందరూ ఉపశమనం పొందారు. అయితే విమానం అదుపు తప్పడానికి సాంకేతిక లోపమా లేక పైలట్ పొరపాటా అనే కోణంలో విమానయాన అధికారులు లోతుగా విచారణ జరుపుతున్నారు.

మాటలతో ధరలు తగ్గవు!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha