Srinivasa Mangapuram Day 1 Collections: సూపర్ స్టార్ కృష్ణ మనవడు, మహేష్ బాబు అన్నయ్య (రమేష్ బాబు) తనయుడు జయకృష్ణ ఘట్టమనేని హీరోగా పరిచయమైన తొలి చిత్రం 'శ్రీనివాస మంగాపురం' జూలై 30న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చింది.
‘ఆర్ఎక్స్ 100’, ‘మంగళవారం’ వంటి వైవిధ్యమైన చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న అజయ్ భూపతి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. బాలీవుడ్ నటి రవీనా టాండన్ కుమార్తె రషా తడాని ఈ సినిమా ద్వారా తెలుగు తెరకు కథానాయికగా పరిచయమైంది.
Read Also : Raashi Khanna: రాశీ ఖన్నాకు రజనీకాంత్ ప్రత్యేక బహుమతి!
What are the first-day collections of ‘Srinivasa Mangapuram’?
Srinivasa Mangapuram Day 1 Collections: కలెక్షన్లు, ప్రేక్షకుల స్పందన
విడుదలైన మొదటి రోజు ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ. 1.25 కోట్ల నెట్ కలెక్షన్లను రాబట్టినట్లు ట్రేడ్ వర్గాల సమాచారం. పాతకాలపు కథాంశాన్ని పాత శైలిలోనే తెరకెక్కించారంటూ కొన్ని వర్గాల నుంచి విమర్శలు వచ్చినప్పటికీ, మాస్ ఎలిమెంట్స్ ,ఘట్టమనేని అభిమానులను ఈ చిత్రం అలరించింది. ముఖ్యంగా జయకృష్ణ స్క్రీన్ ప్రెజెన్స్, ఫైట్స్ ,నటన విషయంలో తొలి సినిమాకే మంచి మార్కులు సాధించారు.
ఆగస్టు 14న థియేటర్లలోకి రానున్న సూర్య 'విశ్వనాథ్ అండ్ సన్స్'

