Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
శ్రీరామకుంట వైకుంఠధామం పనులను పర్యవేక్షించిన హరీశ్ రావు

శ్రీరామకుంట వైకుంఠధామం పనులను పర్యవేక్షించిన హరీశ్ రావు

వార్త 1 week ago

Harish Rao: సిద్ధిపేట పట్టణంలోని శ్రీరామకుంట వైకుంఠధామాన్ని సరికొత్త రీతిలో ఒక ఆహ్లాదకరమైన పార్కు తరహాలో తీర్చిదిద్దుతున్నామని మాజీ మంత్రి, స్థానిక బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌ రావు తెలిపారు.

సిద్దిపేట పట్టణ పరిధిలోని ఈ శ్మశానవాటికలో సాగుతున్న సుందరీకరణ పనులను ఆయన గురువారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడ జరుగుతున్న అభివృద్ధి పనుల తీరుపై సంతృప్తి వ్యక్తం చేసిన ఆయన… మిగిలిన పెండింగ్ పనులను మరింత వేగవంతం చేయాలని అధికారులకు తగిన దిశానిర్దేశం చేశారు.

పచ్చదనం పెంపు, సీసీ రోడ్లు మరియు భద్రతా చర్యలు

శ్మశానవాటిక ప్రాంగణాన్ని మరింత ఆహ్లాదకరంగా మలచడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాము. శ్మశానవాటిక ప్రాంగణంలో పచ్చదనం భారీగా పెంచేలా మరిన్ని మొక్కలు నాటాలని హరీశ్ రావు అధికారులకు సూచించారు. ప్రజల రాకపోకలకు ఎలాంటి అంతరాయం లేకుండా వీలుగా పటిష్టమైన సీసీ రోడ్లను నిర్మించాలని చెప్పారు. అలాగే, వైకుంఠధామంలో పూర్తి భద్రత కల్పించేందుకు అవసరమైన ప్రాంతాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.

Harish Rao: రాత్రి వేళల్లో ఇబ్బందులు లేకుండా లైటింగ్, బయోగ్యాస్ దహన సంస్కారాలు

ముఖ్యంగా రాత్రి వేళల్లో దహన సంస్కారాల కోసం వచ్చే ప్రజలు తగినంత వెలుతురు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న దృష్ట్యా… వెంటనే తగిన లైటింగ్ సౌకర్యాన్ని అందుబాటులోకి తేవాలని ఆయన స్పష్టం చేశారు. వీటితో పాటు టాయిలెట్లకు తక్షణమే అవసరమైన మరమ్మతులు చేపట్టి ఎల్లప్పుడూ శుభ్రత ఉండేలా చూడాలన్నారు. పర్యావరణహిత పద్ధతిలో బయోగ్యాస్ ద్వారా దహన సంస్కారాలు నిర్వహించేలా చేపట్టిన నూతన పనులను త్వరితగతిన పూర్తి చేసి త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని హరీశ్ రావు కోరారు.

Epaper: epaper.vaartha.com

ఉచిత కుట్టుమిషన్ల పథకాన్ని ప్రారంభించిన మంత్రి పొన్నం

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha